పల్లవి:-
తొలకరి వాన -
దీవెనలు కురిపించు వాన
పరిశుద్ధాత్మ వాన -
ప్రభు వర్షించు నీ జీవితాన
అది నూతన పరచును -
ఫలియింపచేయును
సమృద్ధినిచ్చును -
సంతోషపరచును ||తొలకరి||
చరణం 1:-
ఎడారి వంటి
బ్రతుకును సారముగా చేయును
జీవజలముతో నింపి
జీవింపచేయును
ఆకు వాడక
ఫలమిచ్చునట్లు సమృద్ధితో నింపును
||అది నూతన||
చరణం 2:-
సత్యస్వరూపిశుద్ధాత్మా
నీలో వసియించును
పాప బ్రతుకు
తొలగించి నూతన జీవితమిచ్చును
యేసుకొరకు నిజ
సైనికునిగా సజీవ సాక్షిగ నిలుపును |అది
నూతన||
||తొలకరి||
Nice I love this song
ReplyDeletesuperb
ReplyDelete