Wednesday 1 May 2024

 పల్లవి:

    నలిగిన  రెల్లును విడువని దేవుడు

    విరిగిన మనసును లక్ష్యము చేస్తాడు

    బలము కలిగిన ఆయుధంగా మార్చి

    అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి - దీవిస్తాడు        జయమిస్తాడు

1. శ్రమల అలలతో కొట్టబడి - భ్రమర సుడులలో     నెట్టబడి 

    అటుఇటు వంగినా - బహుశా కృంగినా

    ఆదరిస్తాడు యేసుదేవుడు 

    పదునుగలిగిన మ్రానుగ చేస్తాడు                                                                                       "నలిగిన"

2 . అనుమానంతో కాల్చబడి - అపనమ్మికతో             బ్రతుకుచెడి 

     ఆత్మలో నలిగినా - హృదయం పగిలినా

     బాగుచేస్తాడు యేసుదేవుడు 

      స్థిరమైన సాక్షిగా జీవింప చేస్తాడు                                                                                      "నలిగిన"

Share:

Sunday 28 April 2024

పల్లవి:

     దేవుని మందిరం దీవెన ప్రాంగణం

    మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం

    అను.పల్లవి: వేచియున్నది ఆశీర్వాదము -                                  లోనికొచ్చిన నీ సొంతము


1.  ఆలయంలో దేవుని మనసు ఉన్నది.

     ఆయన మహిమ ఆవరించియున్నది

      ఆరాధించుటకు కూర్చున్నవారికి

      యేసయ్య మనసులో చోటున్నది                                                                                        "దేవుని"

2.  వారమంతా పొందిన మేళ్ళన్నింటికై

     కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై    

    ప్రార్ధన చేయుటకు చేరుకున్నవారికి                        

    అక్కర చెప్పుకునే వీలున్నది 

                                                                                                                                                      "దేవుని"

3.  వాక్యాహారముతో ఫలియించుటకు

     దేవుని స్వరమువిని బలమొందుటకు

     సంతోషించుటకు ఆశ ఉన్నవారికి

     సహవాసము నందు పాలున్నది                                                                                        "దేవుని"

Share:

Tuesday 23 April 2024

 హనోకు గారిలోని 7 లక్షణములు

1. ప్రతిష్టిత జీవితాన్ని కల్గి వున్నాడు.

2. పరిశుద్ద అభిషేక జీవితాన్ని కల్గి వున్నాడు.

౩. వరాన్ని కల్గి వున్నాడు .

4. దేవునితో నడిచాడు.

5. కుటుంబాన్ని చూచుకున్నాడు.

6.విశ్వాస జీవితాన్ని కల్గి వున్నాడు.

7. అతడు కొనిపోబడక ముందే దేవునిచేత                 సాక్ష్యము పొందెను.

    కాబట్టి హ్నోకు వలె దేవునితో నడిస్తే మనము         నిలుస్తాము, గెలుస్తాము

Share:

Sunday 21 April 2024



పల్లవి -7

నేర్చుకొనుటకు నీ యెద్ద యేసు కూర్చుండి విందునయ్యా

అను పల్లవి: నేర్పించు యేసయ్యా - నా మంచి బోధకుడా


1 .    సూటిగా గుండెలలోకి చొచ్చుకొనిపోవునట్లు

        చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు              " 
నేర్చు"

2.     ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు

        నేర్పుతో శాస్వతసిరిని కూర్చుకొని వెలుగునట్లు           
నేర్చు"

3.     దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు

        మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు         
 నేర్చు"
Share:

Tuesday 9 April 2024

పల్లవి - 6

అదిగో అంజూరము ఓ క్రైస్థవ

చిగురించెను చూడుము                                                                                                         "అదిగో-2"

ఇదిగో నేను

త్వరగా వత్తును

సిద్దపడుడి అను                                                                                                     "అదిగో-2"

స్వరమును వినవా                                                                                                                                              

చరణం-1

జ్ఞాపకముంచుము లోటు సతీమణి

శాప నగర ప్రియ స్నేహితురాలు

ఆపద నెరిగియు ఆసలు వీడక 

నాశనమొందేను పాఠము నీకిది                                                                            "అదిగో-2"                                                                                                   

చరణం-2

నూట ఇరువది సంవత్సరములు

చాటెను నోవహు దేవుని వార్తను

పాటించక ప్రభు మాటలు వారలు

నీటిలో మునిగిరి పాఠము నీకిది                                                                            "అదిగో-2"                                                                                                           

చరణం-3

లోకము మోసము రంగుల వలయము

నాశనకూపము నిరతము శోకము

యేసే మార్గము సత్యము జీవము

యేసుని రాజ్యము నిత్యానందము                                                                     "అదిగో-2"                                                                                       

                                                            

Share:

Sunday 7 April 2024

పల్లవి - 5

నిన్ను తలచి నను నేను మరచి

నీ సాక్షిగా ఇల నే బ్రతుకు చుంటిని.......(2)

యేసయ్యా.........నీ కృప లేక నే బ్రతుకలేను.....(2)

చరణం-1

జీవములేని దైవారాధనలో నిర్జీవక్రియలతో మృతుడనైతిని.......2)

యేసయ్యా ............నీ కృప లేక నే బ్రతుకలేను.....(2)                                                                                                            "నిన్ను తలచి"

చరణం-2

దారే తెలియని కారు చీకటిలో

బ్రతుకే భారమై నలిగిపోతిని ...................(2)

నీతి సూర్యుడా ఎదలోఉదయించి

బ్రతుకే వెలుగుతో నింపినయేసయ్యా ...................(2)                                                                                                             "నిన్ను తలచి"

చరణం-3

సద్గుణ శీలుడా సుగుణాలు చూచి

హృదిలో నేను మురిసిపోతిని ...................(2)   

సుగుణాలు చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన  యేసయ్యా ...................(2)                           "నిన్ను తలచి"


Share:

Thursday 4 April 2024

 శిష్యరికం

బాప్తిస్మం అయిన తరువాత దేవునిదగ్గరకు వచ్చినప్పుడు రక్షింప బడతారు

ఆయన వెంట నడిస్తే ఆయన అనగా దేవునితో నడిస్తే శిష్యులం అవుతాము.యేసయ్య ఈ లోకంలోనికి వచ్చింది మనలను శిష్యులను తయారు చేయడానికే.

ఆయన అందించిన సువార్తను ఈ లోకంలోనికి తీసుకు వెళ్ళుటకు

మనము కూడా  శిష్యులను తయారు చేసినప్పుడే మనము పరిపూర్ణ క్రైస్థవులం అవుతాము.

కాబట్టి దేవుని నమ్మి బాప్తిస్మం పొందిన తరువాత ఆయన చేయి విడువకుండ విశ్వాసముతో మరికొంతమంది విశ్వాసులను మనముతయారు చేసినప్పుడే ఆయన బిడ్డలుగా ముద్రింపబడతాము.

Share:

Tuesday 2 April 2024


పాట. 4

 ప  ఎక్కడెక్కడో పుట్టి - ఎక్కడెక్కడో పెరిగి

    చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో

అ.ప.ఇది దేవుని సంకల్పం - సృష్టిలో                            విచిత్రం

1. ఒంటరి బ్రతుకులు విడిచెదరు

    ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు

    పెళ్ళినాటినుండి తల్లిదండ్రుల వదలి

    భార్యాభర్తలు హత్తుకొనుటేమిటో

2.   గతకాల కీడంతా మరచెదరు

    మేలులతో సంతసించెదరు

    పెళ్ళినాటినుండి ఒకరి కష్టం ఒకరు

    ఇష్టముతో పంచుకొనుటేమిటో

3.  ఫలియించి భూమిని నింపెదరు

     విస్తరించి వృద్ధిపొందెదరు

     పెళ్ళినాటినుండి మా కుటుంబం అంటూ 

     ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో

Share:

Thursday 14 March 2024

 పాట . 3

ఉన్నావు నాకు తోడుగా - ఇమ్మానుయేలు దేవుడా


1. షెడ్రకు మేషకు అబెద్నగోలతో

    అగ్ని గుండములో నీవును ఉంటివే 

    నిన్ను సేవించిన దానియేలును

    సింహపు బోనులో కాపాడుకుంటివే

    నన్నిల విడువవు- ఎన్నడు మరువవు

    కంటనీరు జారనీయవు


2. నీకై నిలిచిన ఏలియా భక్తుని 

    కడుపులో నీవే పోషించితివే

    నిను ప్రార్ధించిన హిజ్కియా రాజుకు 

    ఆయష్కాలము పోడిగించితివే

    కరుణామయుడవు -కనికరపడెదవు

    చెంతజేరి ఆదరింతువు

Share:

Tuesday 12 March 2024

    పాట. 2

    గెత్సేమనే తోటలో  క్రీస్తేసు వేదన

    మానవాళి విడుదల కొరకైన ప్రార్ధన

    అ.ప: నీ కోసేమే నా కోసమే

    ఆ మరణ పాత్ర మన పాప ఫలితమే


1. ఘోరమైన శ్రమలేన్నో పొందాలని

    కలువరి వరకు సిలువ మోయాలని

    ఎరిగియుండి ఆ పాత్రను స్వీకరించెను

    తన తండ్రి చిత్తమునకు తలవంచెను


2. కొంచెమైన మంచితనము లేని పాపిని

    సంపూర్ణ స్వస్టతతో నింపాలని

    గాయములు పొందుటకు సిద్దమాయెను

    తన తండ్రి చిత్తమునకు తలవంచెను


3. క్షయమగు మనిషిని మహిమకు మార్చాలని

    అక్షయమగు రాజ్యములో చేర్చాలని 

    మరణంపు ద్వారమున ప్రవేశించెను

    తన తండ్రి చిత్తమునకుతలవంచెను

Share:

Wednesday 6 March 2024

 దేవుని కార్యములు గొప్పవి

దేవుడు పేతురును నీటిలో పడిపోవడానికి అనుమతించాడు

కాని మునిగిపోనివ్వలేదు.

దేవుడు దానియేలును సింహాల బోనులోకి విసిరివేయడానికి అనుమతించాడు

కాని వాటిని దానియేలును తిననివ్వలేదు.

అయితే దేవుడు నీ జీవితంలో కొన్ని కష్టతరమైన పనులకు అనుమతిస్తాడు.

కాని దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు.

కాబట్టి కలిమిలో, లేమిలో, కష్టాలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఆయన చేయి విడువకుండా నిరీక్షణతో నమ్మకముతో, విశ్వాసముతో మనకు ఏమి అవసరమో ఆయన తప్పక దయచేస్తాడని  నిరీక్షణ కలిగి ఉండవలెను.

Share:

Tuesday 13 February 2024

పాట 1

    ఎంతటివాడను నేను యేసయ్యా

    కొంతైనా యోగ్యుడను కానయ్యా

    ఇంతగ నను హెచ్చించుటకు

    ఈ స్థితిలో నన్నుంచుటకు

1. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడ నీవె

    హెచ్చించు వాడవును బలమిచ్చువాడవు నీవె

    అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు

    ప్రాణమును నీ సర్వమును నాకొరకై అర్పించినావు

2. నిను వెంబడించువారిని  -  నిజముగ సేవించువారిని

    నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని

    ఎంతో ఘనపరచెదవు - ఆశీర్వదించెదవు

    శత్రువులకంటె ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు

౩. వినయముగల మనుష్యులను వర్దిల్లచేసెదవు

    గర్విష్టుల గర్వమునణచి గద్దెనుండి దించెదవు

    మాదు ఆశ్రయ దుర్గమా - మేమంతా నీవారమే

    మా శైలము మా కేడెమా - మాకున్నదంతా నీ దానమే




Share:

Monday 8 January 2024

న్యాయాధిపతులు ఏలిన దినముల యందు యూదా ఆనే దేశంలో ఎఫ్రాతా  ప్రాంతంలో బెత్లేహెం ఆనే ఊరిలో ఎలీమెలెకు నయోమి అనే వీరు భార్య,  భర్తలుగా కాపురము ఉండిరి.  ఎలీమేలెకు అనగా నా దేవుడు రాజు అని అర్ధం నయోమి అనగా మధురం.  వారికి ఇద్దరు కుమారులు కలరు .  మహ్లోను, కిల్యోను అనగా వ్యాధి, మరణం అని అర్ధం. కొంత కాలమైన తరువాత ఎలీమెలెకు చనిపోయాడు.
అక్కడ విపరీతమైన కరువు రాగా నయోమి వారి ఇద్దరు కుమారులను తీసుకుని ఆ దేశాన్ని వదలి ప్రక్క దేశానికి అనగా యోర్డాను నది దాటి మోయాబు దక్షిణ ప్రాంతానికి వెళ్ళిపోయారు.    
వారి ఇద్దరు కుమారులకు యుక్త వయస్సు రాగా పెండ్లి చేసిరి. ఒకామె పేరు ఓర్పా,మరొకరి పేరు రూతు.వీరిద్దరు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు.

పెండ్లి అయిన 10సంవత్సరాల లోపే నయోమి ఇద్దరు కుమారులు చనిపోయిరి కారణం తెలియదు. తన  అత్త నయోమితో పాటు కోడళ్ళు ఇద్దరు విధవరాండ్రు అయ్యారు. నయోమికి మరలబెత్లేహేములో రొట్టెలు దొరుకుతున్నాయని తన బంధువుల ద్వారా తెలిసినది.  తన ఇద్దరు కోడళ్ళను పిలిచి నా వయస్సు అయిపోయినది నేను మీ కోసం మళ్ళీ పిల్లలను కాని ఇవ్వలేను కాబట్టి మీరు నన్ను మర్చిపోయి మీ దేశం వెళ్ళి ఎవరినైనా ఇద్దరిని చూచి పెళ్ళి చేసుకోండి సీరియస్ గానే చెప్తున్నాను అని చెప్పింది.
Share:

Thursday 4 November 2021

devuni yodda nundi pampabadina vyakti

 

యోహాను ఏసుక్రీస్తుకు  ఆగమన దూత. యోహానుకు  ఏసుక్రీస్తు మరియ గర్భంలో ఉన్నప్పుడే ఆత్మ బాప్తిస్మం ఇచ్చాడు.  అందుకే నీతిని నెరవేర్చుటకు యోహాను ఏసుక్రీస్తుకు నీటి  బాప్తిస్మం ఇచ్చాడు. మలాకి యెషయా వంటి ప్రవక్తలు దీనిని ప్రవచించారు.

Share:

Wednesday 8 September 2021