పల్లవి - 5
నిన్ను తలచి నను నేను మరచి
నీ సాక్షిగా ఇల నే బ్రతుకు చుంటిని.......(2)
యేసయ్యా.........నీ కృప లేక నే బ్రతుకలేను.....(2)
చరణం-1
జీవములేని దైవారాధనలో నిర్జీవక్రియలతో మృతుడనైతిని.......2)
యేసయ్యా ............నీ కృప లేక నే బ్రతుకలేను.....(2) "నిన్ను తలచి"
చరణం-2
దారే తెలియని కారు చీకటిలో
బ్రతుకే భారమై నలిగిపోతిని ...................(2)
నీతి సూర్యుడా ఎదలోఉదయించి
బ్రతుకే వెలుగుతో నింపినయేసయ్యా ...................(2) "నిన్ను తలచి"
చరణం-3
సద్గుణ శీలుడా సుగుణాలు చూచి
హృదిలో నేను మురిసిపోతిని ...................(2)
సుగుణాలు చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా ...................(2) "నిన్ను తలచి"
0 comments:
Post a Comment