పల్లవి - 6
అదిగో అంజూరము ఓ క్రైస్థవ
చిగురించెను చూడుము "అదిగో-2"
ఇదిగో నేను
త్వరగా వత్తును
సిద్దపడుడి అను "అదిగో-2"
స్వరమును వినవా
చరణం-1
జ్ఞాపకముంచుము లోటు సతీమణి
శాప నగర ప్రియ స్నేహితురాలు
ఆపద నెరిగియు ఆసలు వీడక
నాశనమొందేను పాఠము నీకిది "అదిగో-2"
చరణం-2
నూట ఇరువది సంవత్సరములు
చాటెను నోవహు దేవుని వార్తను
పాటించక ప్రభు మాటలు వారలు
నీటిలో మునిగిరి పాఠము నీకిది "అదిగో-2"
చరణం-3
లోకము మోసము రంగుల వలయము
నాశనకూపము నిరతము శోకము
యేసే మార్గము సత్యము జీవము
యేసుని రాజ్యము నిత్యానందము "అదిగో-2"
0 comments:
Post a Comment