పల్లవి -7
నేర్చుకొనుటకు నీ యెద్ద యేసు కూర్చుండి విందునయ్యా
అను పల్లవి: నేర్పించు యేసయ్యా - నా మంచి బోధకుడా
1 . సూటిగా గుండెలలోకి చొచ్చుకొనిపోవునట్లు
చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు " నేర్చు"
2. ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు
నేర్పుతో శాస్వతసిరిని కూర్చుకొని వెలుగునట్లు " నేర్చు"
3. దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు
మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు నేర్చు"
0 comments:
Post a Comment