Friday, 25 September 2020

అల్ప విశ్వాసం - Alpa Viswasam


అల్ప విశ్వాసం - Alpa Viswasam


దేవుని వాక్యం విశ్వాసమును గొప్ప విశ్వాసము, అల్ప విశ్వాసముగా విభజిస్తుంది.

అల్ప విశ్వాసం మనలో భయం పుట్టిస్తుంది.

ఈ విశ్వాసం సర్వశక్తుడైన దేవుని వైపు చూడదు విస్వసించదు.


అల్ప విశ్వాసానికి మూలము మనలోని అనుమానమే.


మనలో విశ్వాసము తగ్గినప్పుడు దేవుడు మనకు అడిగిన వాటిని ఇస్తాడా? అన్న అనుమానం మనకు వస్తుంది. ఈ అనుమానం అనే బాణం మనలో చొచ్చుకొని పోయి మనలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది.

అల్ప విశ్వాసం ఎదుర్కొనేందుకు మనము విశ్వాసము అను డాలును ఉపయోగించాలి.

విశ్వాసము అనగా సర్వాసక్తుడును, ప్రేమామయుడును అయిన దేవుడు మన పక్షమున ఉన్నాడని నమ్ముటయే మత్తయి 16:7-8

అల్ప విశ్వాసము మనవ ఆలోచనకును నూతన వాదనలకును తావిస్తుంది.

అల్ప విశ్వాసము మనలో ఉన్నప్పుడే దేవుని పక్కన పెట్టి మన సమస్యలను మనమే పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తాము.

దేవుడు శిష్యుల అల్ప విశ్వాసానికి ఎలా ప్రతిస్పందించాడో మన అల్ప విశ్వాసానికి అలాగే ప్రతిస్పందిస్తాడు.

కనుక మనము దేవునిలో గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి.

Sharing is Blessing

Share:

0 comments:

Post a Comment