Wednesday, 26 June 2024

బైబిల్లో శక్తి వంతమైన ప్రార్ధనలు - 5

1. యబ్బేజు  ప్రార్ధన :(చిన్న ప్రార్ధన):

1  దినవృ: 4 -10

    యబ్బేజు శక్తి వంతమైన  ప్రార్ధన చేశాడు,            సరిహద్దులను విశాలపరచమని చేశాడు,

2. పరలోక  ప్రార్ధన

   మత్తయి 6:9-13 క్రిస్టియన్లకు మాత్రమే కాక              అన్యులకు కూడ ఉపయోగపడుతుంది, దేవుని    చిత్తం నేరవేర్చబోతున్న ఈ కాలంలో ఈ               ప్రార్ధన అందరికీ ఉపయోగపడుతుంది.

3. రక్షణ కొరకు యోనా  ప్రార్ధన:

    యోనా 2:2-9

    దేవుని మాటను దిక్కరించి దేవుని శరణు                వేడాడు, వినయముతో, నిజాయితితో ప్రార్ధన        చేస్తే దేవుడు క్షమిస్తాడు.

4. దావీదుప్రార్ధన:

    కీర్తనలు ;51;7

    పవిత్ర ఆలోచనలు కలుగ చేయమని ,                    చేడుతనంతో కల్గిన దయాన్నితీసివేయమని          ప్రార్ధన చేశాడు.

5. హన్నా ప్రార్ధన :

    1సమూ2 : 16

   ఎక్కడ తండ్రి మర్చిపోతాడో అని గుర్తు                   చేస్తాము, అలాగే హన్నా కూడా ఒక్క బిడ్డను           దయచేయమని కన్నీటితో అడిగింది .

   దేవుడు దయచేసిన తరువాత కృతజ్ఞతతో           జీవించింది.

Share:

Tuesday, 18 June 2024

 

పల్లవి :

ఉన్నావు తోడుగా - ఇమ్మానుయేలు దేవుడా

1. షడ్రకు మేషకు అబెద్నగోలతో

    అగ్ని గుండములో నీవును ఉంటివే

    నిన్ను సేవించిన దానియేలును

    సింహపు బోనులో కాపాడుకుంటివే

    నన్నిల విడువవు- ఎన్నడు మరువవు   

    కంటనీరు జారనీయవు                       "ఉన్నావు"


2. నీకై నిలిచిన ఏలియా భక్తుని

    కరువులో నీవే పోషించితివే

    నినుప్రార్ధించిన హిజ్కియా రాజుకు 

    ఆయష్కాలము పోడిగించితివే

    కరుణామయుడవు - కనికరపడెదవు

    చెంతజేరి ఆదరింతువు                    "ఉన్నావు"

Share:

Monday, 10 June 2024

పల్లవి :

నీవే శ్రావ్యసదనము - నేవే శాంతి వదనము

నీ దివి సంపద నన్నే చేరగా

నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా

నా ప్రతిస్పందనే ఈ ఆరాధన

నా హృదయార్పణ నీవే యేసయ్యా

చరణం : 1

విరజిమ్మే నాపై కృపా కిరణం

విరబూసే పరిమళమై కృపా కమలం (2)

విశ్వాస యాత్రలో ఒంటరినై 

విజయ శిఖరము చేరుటకు

నీ దక్షిణ హస్తము చాపితివి

నన్నాదుకొనుటకు వచ్చితివి

నను బలపరచి నడిపించే

నా యేసయ్యా (2)                                     "నీవే"

చరణం : 2

నీ నీతి రాజ్యం వెదకితిని

నిండైన సౌభాగ్యం పొందుటకు  (2)

నలిగివిరిగిన హృదయముతో 

నీ వాక్యమును సన్మానించితివి

శ్రేయస్కరమైన దీవెనతో

శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు 

నన్ను ప్రేమించి పిలిచితివి

నా యేసయ్యా                                         "నీవే"




Share:

Tuesday, 21 May 2024


మానసవీణను శ్రుతిచేసి............................

మానసవీణను శ్రుతిచేసి మనసునిండా కృతజ్ఞత నింపి

గొంతెత్తి స్తుతి గీతములే పాడనా

వింతైన దేవుని ప్రేమ నీవిలా చాటవా

1. వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా

    సాయం సమయాన పిచ్చుకలు దేవుని                    స్తుతించవా

    స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట                మేలుకరం                                      మానస"        

   దేవునిఉపకారములకైసదా కీర్తించుటధన్యకరం

2. శ్రమలతో తడబడితే ప్రార్ధనతో సరిచేయి

    దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగానీయి

    మనమే జగతికి వెలుగిస్తే-విశ్వాసగళాలుకలిస్తే 

    స్తుతిరూపం పైపైకెగసి దీవెనలే వర్షింపనా                                                                        మానస"                  

Share:

Monday, 20 May 2024

 మోషే గారు

  • దైవద్దర్శనానుభవం పొందాడు
  • 12౦ సంవత్సరాలు  జీవించాడు
  • 40 సంవత్సరాలు ఇగుప్తు రాజఠీవి పొందాడు
  • 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు
  • 40 సంవత్సరాలు అద్భుతమైన నాయకునిగా ఉన్నాడు
  • దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు
  • ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను\
  • ప్రార్ధన చేస్తే దేవుడు మన్నాను కురుపించాడు
  • మోషే ఎప్పుడైతే దైవ దర్శనం  పొందాడో పాపం తొలగించబడింది 
  • దేవుని బలమైన సాధనముగా దేవుని నోటిబూరగా వాడబడ్డాడు
  • ఇగుప్తులో సకల విద్యలో ప్రావీణ్యుడు మోషే
  • దైవద్దర్శనం వల్ల వాగ్ధాన భూమిలో అడుగుపెట్టాడు

Share:

Thursday, 16 May 2024

 పల్లవి:

    నా ప్రియదేశం భారతదేశం 

    బైబిల్లో వ్రాయబడిన ధన్యమైన దేశం 

 అపల్లవి:    I love my India..................I pray for   India

1. నేను పుట్టిన ఈ దేశాన్నిప్రేమిస్తాను

    భారతీయుడనైనందుకు గర్విస్తాను

    సంతోష సౌభాగ్యం - సమృద్ధి సంక్షేమం

   దేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను

2. క్రైస్తవ్యం మతము కాదని మారుమనసని

    జీవమునకు నడిపించునని వివరిస్తాను

    మతి మార్చువాడు యేసని  మతబోధకుండు        కాడని

    రక్షించే దేవుడని ప్రకటిస్తాను



Share:

Wednesday, 1 May 2024

 పల్లవి:

    నలిగిన  రెల్లును విడువని దేవుడు

    విరిగిన మనసును లక్ష్యము చేస్తాడు

    బలము కలిగిన ఆయుధంగా మార్చి

    అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి - దీవిస్తాడు        జయమిస్తాడు

1. శ్రమల అలలతో కొట్టబడి - భ్రమర సుడులలో     నెట్టబడి 

    అటుఇటు వంగినా - బహుశా కృంగినా

    ఆదరిస్తాడు యేసుదేవుడు 

    పదునుగలిగిన మ్రానుగ చేస్తాడు                                                                                       "నలిగిన"

2 . అనుమానంతో కాల్చబడి - అపనమ్మికతో             బ్రతుకుచెడి 

     ఆత్మలో నలిగినా - హృదయం పగిలినా

     బాగుచేస్తాడు యేసుదేవుడు 

      స్థిరమైన సాక్షిగా జీవింప చేస్తాడు                                                                                      "నలిగిన"

Share:

Sunday, 28 April 2024

పల్లవి:

     దేవుని మందిరం దీవెన ప్రాంగణం

    మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం

    అను.పల్లవి: వేచియున్నది ఆశీర్వాదము -                                  లోనికొచ్చిన నీ సొంతము


1.  ఆలయంలో దేవుని మనసు ఉన్నది.

     ఆయన మహిమ ఆవరించియున్నది

      ఆరాధించుటకు కూర్చున్నవారికి

      యేసయ్య మనసులో చోటున్నది                                                                                        "దేవుని"

2.  వారమంతా పొందిన మేళ్ళన్నింటికై

     కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై    

    ప్రార్ధన చేయుటకు చేరుకున్నవారికి                        

    అక్కర చెప్పుకునే వీలున్నది 

                                                                                                                                                      "దేవుని"

3.  వాక్యాహారముతో ఫలియించుటకు

     దేవుని స్వరమువిని బలమొందుటకు

     సంతోషించుటకు ఆశ ఉన్నవారికి

     సహవాసము నందు పాలున్నది                                                                                        "దేవుని"

Share:

Tuesday, 23 April 2024

 హనోకు గారిలోని 7 లక్షణములు

1. ప్రతిష్టిత జీవితాన్ని కల్గి వున్నాడు.

2. పరిశుద్ద అభిషేక జీవితాన్ని కల్గి వున్నాడు.

౩. వరాన్ని కల్గి వున్నాడు .

4. దేవునితో నడిచాడు.

5. కుటుంబాన్ని చూచుకున్నాడు.

6.విశ్వాస జీవితాన్ని కల్గి వున్నాడు.

7. అతడు కొనిపోబడక ముందే దేవునిచేత                 సాక్ష్యము పొందెను.

    కాబట్టి హ్నోకు వలె దేవునితో నడిస్తే మనము         నిలుస్తాము, గెలుస్తాము

Share:

Sunday, 21 April 2024



పల్లవి -7

నేర్చుకొనుటకు నీ యెద్ద యేసు కూర్చుండి విందునయ్యా

అను పల్లవి: నేర్పించు యేసయ్యా - నా మంచి బోధకుడా


1 .    సూటిగా గుండెలలోకి చొచ్చుకొనిపోవునట్లు

        చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు              " 
నేర్చు"

2.     ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు

        నేర్పుతో శాస్వతసిరిని కూర్చుకొని వెలుగునట్లు           
నేర్చు"

3.     దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు

        మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు         
 నేర్చు"
Share:

Tuesday, 9 April 2024

పల్లవి - 6

అదిగో అంజూరము ఓ క్రైస్థవ

చిగురించెను చూడుము                                                                                                         "అదిగో-2"

ఇదిగో నేను

త్వరగా వత్తును

సిద్దపడుడి అను                                                                                                     "అదిగో-2"

స్వరమును వినవా                                                                                                                                              

చరణం-1

జ్ఞాపకముంచుము లోటు సతీమణి

శాప నగర ప్రియ స్నేహితురాలు

ఆపద నెరిగియు ఆసలు వీడక 

నాశనమొందేను పాఠము నీకిది                                                                            "అదిగో-2"                                                                                                   

చరణం-2

నూట ఇరువది సంవత్సరములు

చాటెను నోవహు దేవుని వార్తను

పాటించక ప్రభు మాటలు వారలు

నీటిలో మునిగిరి పాఠము నీకిది                                                                            "అదిగో-2"                                                                                                           

చరణం-3

లోకము మోసము రంగుల వలయము

నాశనకూపము నిరతము శోకము

యేసే మార్గము సత్యము జీవము

యేసుని రాజ్యము నిత్యానందము                                                                     "అదిగో-2"                                                                                       

                                                            

Share:

Sunday, 7 April 2024

పల్లవి - 5

నిన్ను తలచి నను నేను మరచి

నీ సాక్షిగా ఇల నే బ్రతుకు చుంటిని.......(2)

యేసయ్యా.........నీ కృప లేక నే బ్రతుకలేను.....(2)

చరణం-1

జీవములేని దైవారాధనలో నిర్జీవక్రియలతో మృతుడనైతిని.......2)

యేసయ్యా ............నీ కృప లేక నే బ్రతుకలేను.....(2)                                                                                                            "నిన్ను తలచి"

చరణం-2

దారే తెలియని కారు చీకటిలో

బ్రతుకే భారమై నలిగిపోతిని ...................(2)

నీతి సూర్యుడా ఎదలోఉదయించి

బ్రతుకే వెలుగుతో నింపినయేసయ్యా ...................(2)                                                                                                             "నిన్ను తలచి"

చరణం-3

సద్గుణ శీలుడా సుగుణాలు చూచి

హృదిలో నేను మురిసిపోతిని ...................(2)   

సుగుణాలు చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన  యేసయ్యా ...................(2)                           "నిన్ను తలచి"


Share:

Thursday, 4 April 2024

 శిష్యరికం

బాప్తిస్మం అయిన తరువాత దేవునిదగ్గరకు వచ్చినప్పుడు రక్షింప బడతారు

ఆయన వెంట నడిస్తే ఆయన అనగా దేవునితో నడిస్తే శిష్యులం అవుతాము.యేసయ్య ఈ లోకంలోనికి వచ్చింది మనలను శిష్యులను తయారు చేయడానికే.

ఆయన అందించిన సువార్తను ఈ లోకంలోనికి తీసుకు వెళ్ళుటకు

మనము కూడా  శిష్యులను తయారు చేసినప్పుడే మనము పరిపూర్ణ క్రైస్థవులం అవుతాము.

కాబట్టి దేవుని నమ్మి బాప్తిస్మం పొందిన తరువాత ఆయన చేయి విడువకుండ విశ్వాసముతో మరికొంతమంది విశ్వాసులను మనముతయారు చేసినప్పుడే ఆయన బిడ్డలుగా ముద్రింపబడతాము.

Share:

Tuesday, 2 April 2024


పాట. 4

 ప  ఎక్కడెక్కడో పుట్టి - ఎక్కడెక్కడో పెరిగి

    చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో

అ.ప.ఇది దేవుని సంకల్పం - సృష్టిలో                            విచిత్రం

1. ఒంటరి బ్రతుకులు విడిచెదరు

    ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు

    పెళ్ళినాటినుండి తల్లిదండ్రుల వదలి

    భార్యాభర్తలు హత్తుకొనుటేమిటో

2.   గతకాల కీడంతా మరచెదరు

    మేలులతో సంతసించెదరు

    పెళ్ళినాటినుండి ఒకరి కష్టం ఒకరు

    ఇష్టముతో పంచుకొనుటేమిటో

3.  ఫలియించి భూమిని నింపెదరు

     విస్తరించి వృద్ధిపొందెదరు

     పెళ్ళినాటినుండి మా కుటుంబం అంటూ 

     ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో

Share:

Thursday, 14 March 2024

 పాట . 3

ఉన్నావు నాకు తోడుగా - ఇమ్మానుయేలు దేవుడా


1. షెడ్రకు మేషకు అబెద్నగోలతో

    అగ్ని గుండములో నీవును ఉంటివే 

    నిన్ను సేవించిన దానియేలును

    సింహపు బోనులో కాపాడుకుంటివే

    నన్నిల విడువవు- ఎన్నడు మరువవు

    కంటనీరు జారనీయవు


2. నీకై నిలిచిన ఏలియా భక్తుని 

    కడుపులో నీవే పోషించితివే

    నిను ప్రార్ధించిన హిజ్కియా రాజుకు 

    ఆయష్కాలము పోడిగించితివే

    కరుణామయుడవు -కనికరపడెదవు

    చెంతజేరి ఆదరింతువు

Share: