మానసవీణను శ్రుతిచేసి............................
మానసవీణను శ్రుతిచేసి మనసునిండా కృతజ్ఞత నింపి
గొంతెత్తి స్తుతి గీతములే పాడనా
వింతైన దేవుని ప్రేమ నీవిలా చాటవా
1. వేకువనే పక్షులు లేచి స్తుతి కేకలు వేయవా
సాయం సమయాన పిచ్చుకలు దేవుని స్తుతించవా
స్తుతి చేయుట క్షేమకరం - ఘనపరచుట మేలుకరం మానస"
దేవునిఉపకారములకైసదా కీర్తించుటధన్యకరం
2. శ్రమలతో తడబడితే ప్రార్ధనతో సరిచేయి
దిగులుతో శృతి తగ్గితే నమ్మికతో సాగానీయి
మనమే జగతికి వెలుగిస్తే-విశ్వాసగళాలుకలిస్తే
స్తుతిరూపం పైపైకెగసి దీవెనలే వర్షింపనా మానస"
0 comments:
Post a Comment