పల్లవి:
నలిగిన రెల్లును విడువని దేవుడు
విరిగిన మనసును లక్ష్యము చేస్తాడు
బలము కలిగిన ఆయుధంగా మార్చి
అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి - దీవిస్తాడు జయమిస్తాడు
1. శ్రమల అలలతో కొట్టబడి - భ్రమర సుడులలో నెట్టబడి
అటుఇటు వంగినా - బహుశా కృంగినా
ఆదరిస్తాడు యేసుదేవుడు
పదునుగలిగిన మ్రానుగ చేస్తాడు "నలిగిన"
2 . అనుమానంతో కాల్చబడి - అపనమ్మికతో బ్రతుకుచెడి
ఆత్మలో నలిగినా - హృదయం పగిలినా
బాగుచేస్తాడు యేసుదేవుడు
స్థిరమైన సాక్షిగా జీవింప చేస్తాడు "నలిగిన"
0 comments:
Post a Comment