పల్లవి:
దేవుని మందిరం దీవెన ప్రాంగణం
మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం
అను.పల్లవి: వేచియున్నది ఆశీర్వాదము - లోనికొచ్చిన నీ సొంతము
1. ఆలయంలో దేవుని మనసు ఉన్నది.
ఆయన మహిమ ఆవరించియున్నది
ఆరాధించుటకు కూర్చున్నవారికి
యేసయ్య మనసులో చోటున్నది "దేవుని"
2. వారమంతా పొందిన మేళ్ళన్నింటికై
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై
ప్రార్ధన చేయుటకు చేరుకున్నవారికి
అక్కర చెప్పుకునే వీలున్నది
"దేవుని"
3. వాక్యాహారముతో ఫలియించుటకు
దేవుని స్వరమువిని బలమొందుటకు
సంతోషించుటకు ఆశ ఉన్నవారికి
సహవాసము నందు పాలున్నది "దేవుని"
0 comments:
Post a Comment