Showing posts with label Telugu christian songs lyrics. Show all posts
Showing posts with label Telugu christian songs lyrics. Show all posts

Monday, 29 June 2020

Oohinchagalana Song Lyrics - ఊహించగలనా!


ఊహించగలనా  ఈ ప్రణాళికను
 
ఊహించగలనా  ఈ ప్రణాళికను
యోగ్యత లేని నన్ను కరుణించిన కృపను

పాపా శాప భారంతో సొమ్మసిల్లి యుంటిని
ఎటు పయ నించాలో తెలియక యుంటిని
ప్రాణ మిచ్చినానంటూ  సేద దీర్చుకోమంటూ   
తెలుసుకో నన్నంటూ  గమ్యమే నేనంటూ
వచ్చావ యేసయ్య నన్నే ప్రేమించి
తెచ్చావ రక్షణనే నను కనికరించి  
||ఊహించగలనా||
మనసున్న మా రాజా పరలోక రారాజా
సన్నుతించేనయ్యా   నిన్నే నా నాథా
పిలుచుకున్నావయ్యా   మలచుకున్నావయ్యా
నీ సేవ  భారంతో నన్ను  నింపావయ్య
వచ్చాను యేసయ్య నీ పాద సన్నిధికి
తెచ్చాను యేసయ్య నా అర్పణ లన్ని 
||ఊహించగలనా||

-బ్రదర్ వేణు & సిస్టర్ జ్ఞాన ప్రసన్న 
Oohinchagalana lyrics
 
Share:

Friday, 29 May 2020

జ్యోతిర్మయుడా - Jyothirmayuda


జ్యోతిర్మయుడా

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే

 నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే..

 నా ఆనందము నీవే.. నా ఆరాధనా నీవే

 

1. నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా

 నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటుక్టి స్థిరపరిచావా

 

2. నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరి

 నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై నుంచావా

 

3. నా తండ్రి కుమారా - పరిశుద్ధాత్ముడా

 త్రియేక దేవా ఆది సంభూతుడా నిను నేనేమని ఆరాధించెద

Share:

మహోన్నతుడా - Mahonnathuda


మహోన్నతుడా

మహోన్నతుడా

నీ కృపలో నేను నివసించుట

నా జీవిత ధన్యతై యున్నది

మహోన్నతుడా

నీ కృపలో నేను నివసించుట -2          

||మహోన్నతుడా||

మోడుబారిన జీవితాలను

చిగురింప జేయగలవు నీవు -2

మారా అనుభవం మధురముగా

మార్చగలవు నీవు -2            

||మహోన్నతుడా||

ఆకు వాడక ఆత్మ ఫలములు

ఆనందముతో ఫలియించినా -2

జీవ జలముల ఊట అయిన

నీ ఓరన నను నాటితివా -2     

||మహోన్నతుడా||

వాడబారని స్వాస్థ్యము నాకై

పరమందు దాచి యుంచితివా -2

వాగ్ధాన ఫలము అనుభవింప

నీ కృపలో నన్ను పిలచితివా -2 

||మహోన్నతుడా||

Share:

Thursday, 28 May 2020

నీదు ప్రేమకు హద్దు లేదయా - Needu Premaku Haddu ledayya


నీదు ప్రేమకు హద్దు లేదయా

నీదు ప్రేమకు హద్దు లేదయా
నీదు ప్రేమకు కొలత లేదయా
నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు
పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా

||నీదు||

తల్లి తండ్రులు చూపలేని ప్రేమ
తనయులివ్వని తేటనైన ప్రేమ -2
పేదలకు నిరు పేదలకు
విధవలకు అనాథలకు -2
బంధు మిత్రులు చూపలేని ప్రేమా -2
కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా      

||నీదు||

నరులకై నర రూపమైన ప్రేమ
పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ -2
దొంగలకు వ్యభిచారులకును
కౄరులకు నర హంతకులకు
మనుజులివ్వని మధురమైన ప్రేమా -2
కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా      

||నీదు||

 


Share:

Friday, 1 June 2018

ఈ లోకంలో జీవించెదను - Ee lokamlo jeevinchedanu lyrics

ఈ లోకంలో జీవించెదను

పల్లవి :

ఈ లోకంలో జీవించెదను
నీ కొరకే దేవా
 
నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు
నీలా ప్రేమించే వారు
నీవే నా ప్రాణ ప్రియుడవు

చరణం 1  :

తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా
విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు
 
ఎంత లోతైనది నీ ప్రేమా
నిన్ను విడచి నే బ్రతుకలేను

చరణం 2  :

అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే
నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే
 
నీ దృష్టిలో నేనున్నాగా
ఇలలో నే జడియను

Ee lokamlo jeevinchedanu lyrics

Share:

ఈ దినం క్రీస్తు జన్మదినం - Ee dinam Kristhu Janmadinam lyrics

ఈ దినం క్రీస్తు జన్మదినం

పల్లవి :

ఈ దినం క్రీస్తు జన్మదినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం
 
ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో

చరణం 1  :

దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం
 
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం

చరణం 2  :

పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును
 
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము
 

 Ee dinam Kristhu Janmadinam

Share:

Monday, 22 May 2017

నా హృదయములో - Naa Hrudayamulo Lyrics


నా హృదయములో

 పల్లవి :-

నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతిరేఖలు

 కారు చీకటిలో కలువరి కిరణమై

 కఠినహృదయమును కరిగించినావు

 నీ కార్యములను వివరింపతరమా ? నీ ఘనకార్యములు వర్ణింపతరమా ?

 

చరణం 1 :-

మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలె కృపను కురిపించితివి

 విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు

 నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు

||నీ కార్యములను||

చరణం 2  :-

విరజిమ్మె ఉదయకాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి

 అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు ఆర్పజాలని జ్వాలగా చేసి ద్వీపస్థంభముపై నను నిలిపినావు

||నీ కార్యములను||

చరణం 3 :-

పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు

 పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు

 సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు

Share:

యేసయ్య కనికరపూర్ణుడా - Yesayya Kanikarapurnuda Lyrics


యేసయ్య కనికరపూర్ణుడా

పల్లవి :-
యేసయ్య
 కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా 

నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము
 

నా వలన
  ఏదియు ఆశింపకయే ప్రేమించితివి

 నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి 

 సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి 

శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే
  


||యేసయ్య||
 
 

చరణం 1 :-

 నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు 

దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి
 

ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి
 

అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము
  


||యేసయ్య||
 


చరణం 2
  :- 

నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన 

 సీయెనులో వారు నిలిచెదరు 

 నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు 

నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు
 


||యేసయ్య||
 


ఆరాధనకు
 యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు .

Share:

కన్నీరేలమ్మ - Kannerelamma

కన్నీరేలమ్మ

పల్లవి :-

కన్నీరేలమ్మ - కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కలవరపడకమ్మ - కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కరుణ చూపి కలత మాన్పే - ఏసే  తోడమ్మా

 

చరణం 1:-

నీకేమి లేదని ఏమి తేలేదని

అన్నారా నిన్ను అవమానపరిచారా

తల రాత ఇంతేనని తరువాత ఏమవునని

రేపటిని చింతించుచున్నావా

చింతించకన్న యేసు మాటలు మరిచావా

మారను మధురముగా మార్చెను చూసావా

||కన్నీరేలమ్మ||

చరణం 2:-

 నీకెవరు లేరని  ఏంచేయలేవని

అన్నారా నిన్ను నిరాషాపరిచారా

పురుగంటి వాడనని ఎప్పటికి ఇంతేనని

నా బ్రతుకు మారదని అనుకుంటూవున్నావా

నేనున్నానన్న  యేసు మాటలు మరిచావా

కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా

||కన్నీరేలమ్మ||

Share:

దేవా నీ సాక్షిగా - Deva nee Sakshigaa Lyrics



 దేవా నీ సాక్షిగా నేనునoడుట

దేవా నీ సాక్షిగా నేనునoడుట
ఈ మంటికి భాగ్యము
జాలిగా మనుజాలికై కలువరిలోన ఆ యాగము
చాటెద ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగేవరకు
 ||దేవా నీ సాక్షిగా  ||

నాలాంటి నరమాత్రుని చేరుట
నీవంటి పరిశుద్దునికేలనో
ఎ మేధావికి విధితమేకాదిది
కేవలం నీ కృపే దీనికాధారము
ఈ సంకల్పమే నా సౌభాగ్యమే నా బ్రతుకంత కొనియాడుతా...
 ||దేవా నీ సాక్షిగా  ||

నా ఊహకందని మేలుతో
నా గుండె నిండిది మేలుతో
నా కన్నీటిని మార్చి పన్నీరుగా
నాట్యము చేయు అనుభవమిచ్చావుగా
ఈ శుభవార్తను చాటు సందేశము నేను ఎలుగెత్తి ప్రకటించెద...
 ||దేవా నీ సాక్షిగా  ||
ఈ పాటను చూచుటకు\వినుటకు  క్రింది లింక్ ను నొక్కండి ⤵
To watch video of this song clink the link given below ⤵
Share: