Showing posts with label ka. Show all posts
Showing posts with label ka. Show all posts

Friday, 8 January 2021

Friday, 10 July 2020

కొండలలో లోయలలో - Kondalalo Loyalalo



కొండలలో లోయలలో

అడవులలో ఎడారులలో  -2

నన్ను గమనించినావా

నన్ను నడిపించినావా  -2       

||యేసయ్యా||


యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

నీవే నీవే నా రాజువయ్యా  -2

యేసయ్య యేసయ్య యేసయ్యా....


ఆత్మీయులే నన్ను అవమానించగా

అన్యులు నన్ను అపహసించగా  -2

అండ నీవైతివయ్యా

నా.. కొండ నీవే యేసయ్యా  -2     

||యేసయ్యా||

మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ

నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప  -2

నన్ను బలపరచెనయ్యా

నిన్నే ఘనపరతునయ్యా  -2     

||యేసయ్యా||

వంచెన వంతెన ఒదిగిన భారాన

ఒసగక విసిగిన విసిరె కెరటాన  -2

కలలా కడతేర్చినావా

నీ వలలో నను మోసినావా  -2     

||యేసయ్యా||

Kondalalo Loyalalo lyrics
Original Song by K RAJA BABU GARU

Beautiful heart touching telugu christian song sung by Bro. Prabhu Pammi
NINNE NINNE NE KOLUTHUNAYYA
Share:

Saturday, 4 July 2020

కనురెప్పపాటైనా కనుమూయలేదు - kanureppa patina song lyrics



కనురెప్పపాటైనా కనుమూయలేదు  

ఊపిరికే ఊపిరివై...

పాటల పల్లకివై నిలిచావు

కనురెప్ప పాటైన కను మూయలేదు ప్రేమ ప్రేమ  
నిరుపేద స్థితి లోను నను దాటిపోలేదు ప్రేమ ప్రేమ
పగలు రేయి పలకరిస్తుంది పరమును విడచి నను వరియించింది
కలవరిస్తుంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ 

||కనురెప్ప|| 

1.    ప్రేమ చేతిలో నను చెక్కు కున్నది

ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది
ప్రేమకు మించిన దైవము లేదని

ప్రేమను కలిగి జీవించమని

ఎదురు చూస్తుంది ప్రేమా

కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ 

||కనురెప్ప||

2.     ప్రేమ లోగిలికి నన్ను పిలుచు చున్నది

ప్రేమ కౌగిలిలో బందించుచున్నది
ప్రేమకు ప్రేమే తోడవుతుందని 

ప్రేమకు సాటి లేనె లేదని

కలవరిస్తుంది ప్రేమా

కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ 

||కనురెప్ప||

 

రచన – గుంటూరు రాజా

 

kanureppa patina song lyrics
Share:

Friday, 12 June 2020

కృపా క్షేమము - Krupa Kshemamu


కృపా క్షేమము

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు

మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి
నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి

అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను

నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే
ఆరాధన నీకే
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే
ఆరాధన నీకే

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి
నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే

గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే

నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే
ఆరాధన నీకే

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని
నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని

బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా

ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే
ఆరాధన నీకే

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

 

Krupa Kshemamu lyrics
Share:

కమ్మని బహుకమ్మని - Kammani Bahu Kammani


కమ్మని బహుకమ్మని

కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని

తెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం -2

జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం -2

యేసు నీ ప్రేమామృతం -2       

||కమ్మని||

ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితం

యేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన -2

వెలిగెను నాలో నీ ఆత్మ దీపము -2

కడిగిన ముత్యముగా అయ్యాను నేను -2     

 ||కమ్మని||

నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవ

నా గుండె గుడిలో కొలువైయున్న – నీకు చేసెద నేను మధుర సేవ -2

ఆరాధింతును నిన్ను అనుదినము -2

జీవింతును నీకై అనుక్షణము -2    

   ||కమ్మని||

Kammani Bahu Kammani lyrics
Share:
Categories

Friday, 5 June 2020

కృపామయుడా నీలోనా - Krupamayuda Neelone


కృపామయుడా నీలోనా

కృపామయుడా నీలోనా - నివసింప జేసినందునా - ఇదిగో నాస్తుతుల సింహాసనం

నీలో నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం- కృపామయుడా... ఆ అ

 

ఏ అపాయము నా గుడారము - సమీపించనియ్యక -2

నా మార్గములన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున -2

 

చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా-2

రాజ వంశములో - యాజకత్వము చేసెదను -2

 

నీలో నిలచి ఆత్మ ఫలములు - ఫలియించుట కొరకు -2

నాపైనా నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు -2

 

ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీట మిచ్చుటకు -2

నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను -2

Krupamayuda Neelone lyrics
Share:

కృపలను తలంచుచు - Krupalanu Thalanchuchu


కృపలను తలంచుచు

కృపలను తలంచుచు -2

ఆయుష్కాలమంతా ప్రభుని

కృతజ్ఞతతో స్తుతింతున్ -2      

||కృపలను||

రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను -2

నాకు విరోధమై వర్ధిల్లదు యని

చెప్పిన మాట సత్యం – -2     

 ||కృపలను||

హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే -2

సీయోను నివాసం నాకెంతో ఆనందం

ఆనందమానందమే – -2     

 ||కృపలను||

Krupalanu Thalanchuchu lyrics 
Share:

Wednesday, 20 May 2020

Tuesday, 6 March 2018

కొడుక కొడుక కన్న కొడుక - Kodaka Kodaka kanna Kodaka lyrics

కొడుక కొడుక కన్న కొడుక

పల్లవి :

కొడుక కొడుక కన్న కొడుక
కడుపు చింపుకొని కన్న కొడుకా
ఉన్న ఒక్కడివి ఉమ్ములూసావా
కన్న తల్లిని సిలువేసావా 

చరణం 1  :

ఏదేను తోట తండ్రి ఇల్లురా
ఆదాము హవ్వ కడుకు కోడలురా
కోడలు వచ్చింది సర్పమోచ్చిందిరా
తండ్రి కొడుకును వేరు చేసిందిరా
ఎంతగా అల్లాడిపోయేనో  ఆ పరమ తండ్రి
అంతగా సిలువ బలియాయేనో ఆ కొడుకు కోసం 


చరణం 2  :

ఓ విధవరాలా నోరు మూసుకో
ఓ ముసలిదానా మూలాన కూర్చో
సర్పము దర్పము పడగ విప్పిందిరా
తల్లి కొడుకును వేరు చేసిందిరా
ఎంతగా అల్లాడిపోయేనో  ఆ కన్న తల్లి 

అంతగా సిలువ వ్రేలాడెనో ఆ కొడుకు కోసం



Share:
Categories

Wednesday, 28 February 2018

కలువరి సిలువ ప్రేమ - Kaluvari siluva prema lyrics

కలువరి సిలువ ప్రేమ  

పల్లవి :

ఈ లోకంలో ఎవ్వరు చూపని కలువరి సిలువ ప్రేమ ఇది
కాలాలే మారిన మారని ప్రేమ ఇది
ప్రేమ యేసుని ప్రేమ ... ప్రేమ కలువరి ప్రేమ

నను విడువని ప్రేమ... నను మరువని ప్రేమ...


చరణం 1  :

శోకించు వేళ విలపించు వేళ
యేసు నను చూచెనే ... నా  భారము తొలగించెను
నీ వెంటే నేనున్నా కన్నీరెందుకని
నీ చెంతే నేనుంటా దిగులేచెందకని
మనుషుల ప్రేమ ఆశించిన కన్నీరే మిగులునని

పలికిన నా యేసయ్య నీకే స్తోత్రమయా 


చరణం 2  :

శపియించబడి నేను కృసియించు వేళ
తోడు నీవైతివే నా నీడ నీవైతివే
నే నిన్ను విడచిన నన్ను విడువక వెంబడించినావే
నే నిన్ను మరచిన నన్ను మరువక పలకరించినావే
గమ్యం లేని పయనంలో ప్రభు యేసే గమ్యమని
తెలుసుకొంటినయ్య నను మలచుకొంటినయ్య 

Share:

Monday, 5 February 2018

కడసారి శిష్యులకు - Kadasari Sishuyalku lyrics


కడసారి శిష్యులకు


పల్లవి 
కడసారి శిష్యులకు పంచిన ఆహారం
మనసార స్వీకరించు అదే పాప పరిహారం
జీవాహారం దేవుని దివ్యాహారం
ఈ ప్రసాదం దివ్య సత్ప్రసాదం










చరణం 1 
కనులు తెరచినా... కనులు మూసినా...
కరిగిపోనిది నీ రూపం
మనసు నిండదు... దాహమాడదు
అంతులేనిది ఈ తాపం
మదిలోపలి చీకట్లు తరిమివేయు మార్గం
ఎదలోపలి వెలితిని వెలికితీయు సత్యం


 












చరణం 2  
వెతలను తీర్చి వెలుగును నింపే
కరుణరాగ సుధావర్షిని
సుధలను చిలికి సమతను కూర్చే
పాపహారిణి సుమధుర వాహిని
కడవరకు తోడువచ్చు మన యేసే మార్గం
విశ్వసించు సోదరా నిజ యేసే నిత్యం


















Share:

Monday, 22 May 2017

కన్నీరేలమ్మ - Kannerelamma

కన్నీరేలమ్మ

పల్లవి :-

కన్నీరేలమ్మ - కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కలవరపడకమ్మ - కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కరుణ చూపి కలత మాన్పే - ఏసే  తోడమ్మా

 

చరణం 1:-

నీకేమి లేదని ఏమి తేలేదని

అన్నారా నిన్ను అవమానపరిచారా

తల రాత ఇంతేనని తరువాత ఏమవునని

రేపటిని చింతించుచున్నావా

చింతించకన్న యేసు మాటలు మరిచావా

మారను మధురముగా మార్చెను చూసావా

||కన్నీరేలమ్మ||

చరణం 2:-

 నీకెవరు లేరని  ఏంచేయలేవని

అన్నారా నిన్ను నిరాషాపరిచారా

పురుగంటి వాడనని ఎప్పటికి ఇంతేనని

నా బ్రతుకు మారదని అనుకుంటూవున్నావా

నేనున్నానన్న  యేసు మాటలు మరిచావా

కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా

||కన్నీరేలమ్మ||

Share: