Showing posts with label hosanna songs lyrics. Show all posts
Showing posts with label hosanna songs lyrics. Show all posts

Friday, 12 June 2020

కృపా క్షేమము - Krupa Kshemamu


కృపా క్షేమము

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు

మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి
నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి

అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను

నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే
ఆరాధన నీకే
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే
ఆరాధన నీకే

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి
నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే

గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే

నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే
ఆరాధన నీకే

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని
నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని

బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా

ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే
ఆరాధన నీకే

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

 

Krupa Kshemamu lyrics
Share:

Friday, 5 June 2020

కృపామయుడా నీలోనా - Krupamayuda Neelone


కృపామయుడా నీలోనా

కృపామయుడా నీలోనా - నివసింప జేసినందునా - ఇదిగో నాస్తుతుల సింహాసనం

నీలో నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం- కృపామయుడా... ఆ అ

 

ఏ అపాయము నా గుడారము - సమీపించనియ్యక -2

నా మార్గములన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున -2

 

చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా-2

రాజ వంశములో - యాజకత్వము చేసెదను -2

 

నీలో నిలచి ఆత్మ ఫలములు - ఫలియించుట కొరకు -2

నాపైనా నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు -2

 

ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీట మిచ్చుటకు -2

నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను -2

Krupamayuda Neelone lyrics
Share:

కృపలను తలంచుచు - Krupalanu Thalanchuchu


కృపలను తలంచుచు

కృపలను తలంచుచు -2

ఆయుష్కాలమంతా ప్రభుని

కృతజ్ఞతతో స్తుతింతున్ -2      

||కృపలను||

రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను -2

నాకు విరోధమై వర్ధిల్లదు యని

చెప్పిన మాట సత్యం – -2     

 ||కృపలను||

హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే -2

సీయోను నివాసం నాకెంతో ఆనందం

ఆనందమానందమే – -2     

 ||కృపలను||

Krupalanu Thalanchuchu lyrics 
Share:

నేనెందుకని నీ సొత్తుగా మారితిని - Nenendukani nee Sothugaa maarithini


నేనెందుకని నీ సొత్తుగా మారితిని

నేనెందుకని నీ సొత్తుగా మారితిని

యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున

నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ

 

నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే

నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే

అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును           

||నేనె||

నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే

నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే

అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును             

||నేనె||

నీలో నేనుండుటే – నాలో నీవుండుటే – నా ఆత్మీయ అనుభవమే

పరిశుద్ధాత్ముని అభిషేకముతో – నే పరిపూర్ణత చేందెద

అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును              

|| నేనె||

Share:

ఆనందమే పరమానందమే - Aanandame Paramaanandame


ఆనందమే పరమానందమే

ఆనందమే పరమానందమే

ఆశ్రయపురమైన యేసయ్యా నీలో -2

ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన

అక్షయుడా నీకే స్తోత్రము -2      

||ఆనందమే||

పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే

జీవ జలములు త్రాగనిచ్చితివే -2

నా ప్రాణమునకు సేదదీర్చితివి

నీతియు శాంతియు నాకిచ్చితివే -2      

||ఆనందమే||

గాఢాంధకారము లోయలలో నేను

సంచరించినా దేనికి భయపడను -2

నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును

అనుదినం అనుక్షణం కాపాడునే -2      

||ఆనందమే||

 

నా శత్రువుల ఎదుటే నీవు

నాకు విందును సిద్ధము చేసావు -2

నీతో నేను నీ మందిరములో

నివాసము చేసెద చిరకాలము -2      

||ఆనందమే||

Share:

నా ప్రాణమా నాలో నీవు - Naa Pranama Naalo Neevu


నా ప్రాణమా నాలో నీవు

నా ప్రాణమా నాలో నీవు

ఎందుకు కృంగియున్నావు

యెహోవాయందే ఇంకను

నిరీక్షణ ఉంచుము నీవు -2

||నా ప్రాణమా||

ఈతి బాధల్ కఠిన శ్రమలు

అవమానములే కలిగిన వేళ -2

నీ కొరకే బలియైన యేసు

సిలువను గూర్చి తలపోయుమా -2

అల్పకాల శ్రమల పిదప

మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా -2

||నా ప్రాణమా||

ఆప్తులంతా నిను వీడిననూ

శత్రువులే నీపై లేచిననూ -2

తల్లి అయినా మరచినా మరచున్

నేను నిన్ను మరువాననినా -2

యేసుని ప్రేమన్ తలపోయుమా

ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా -2

||నా ప్రాణమా||

ఐశ్వర్యమే లేకున్ననూ

సౌఖ్య జీవితమే కరువైననూ -2

ప్రభు సేవలో ప్రాణములనే

అర్పించవలసి వచ్చిననూ -2

క్రీస్తునికే అంకితమై ఆనందించు

ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా -2

||నా ప్రాణమా||

Share:

జుంటె తేనె ధారలకన్న - Junti Thene Dharalakante


జుంటె తేనె ధారలకన్న

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం

యేసయ్యా సన్నిధినే మరువజాలను

జీవిత కాలమంతా ఆనదించెదాయేసయ్యనే ఆరాధించెదా

 

యేసయ్య నామమే బహు పూజ్యనీయము

నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి

నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే

 

యేసయ్య నామమే బలమైన ధుర్గము

నాతోడై నిలచి క్షేమముగా నను దాచి

నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే

 

యేసయ్య నామమే పరిమళ తైలము

నాలో నివసించె సువాసనగా నను మార్చె

నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే

Share:

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా - Athyunnatha Simhaasanamupai


అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా

దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా

యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు

నా మనసార నీ సన్నిధిలో

సాగిలపడి నమస్కారము చేసేదా

సాగిలపడి నమస్కారము చేసేదా -2

 

ప్రతి వసంతము నీ దయా కిరీటమే

ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే -2

ప్రభువా నిన్నే ఆరాధించెద

కృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో -2        

||అత్యున్నత||

పరిమలించునే నా సాక్ష్య జీవితమే

పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే -2

పరిశుద్ధాత్మలో ఆనందించెద

హర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో -2          

||అత్యున్నత||

పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే

నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే -2

యెహోవ నిన్నే మహిమ పరచెద

స్తుతి గీతాలతో – స్తుతి గీతాలతో -2     

||అత్యున్నత||

 Athyunnatha Simhaasanamupai  lyrics
Share:

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా - Choochuchunna Devudavu Neeve Yesayya


చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా

చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన

నీ నేత్రాలంకృతము -2

 

పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో

క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో -2

ఆప్యాయతకు నోచుకొనని

నను చేరదీసిన కృపా సాగరా -2       

||చూచుచున్న||

అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు

తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా -2

అగ్ని వంటి శోధనలను

తప్పించితివే దయా సాగరా -2         

||చూచుచున్న||

Share:

నా హృదయాన కొలువైన యేసయ్యా - Naa Hrudayana koluvaina Yesayya


నా హృదయాన కొలువైన యేసయ్యా

నా హృదయాన కొలువైన - యేసయ్యా

నా అణువణువు  నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా

నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే

నీ  సన్నిధిలో పూజార్హుడా - 2

నా హృదయాన కొలువైన - యేసయ్యా.....

 

అగ్ని ఏడంతలై - మండుచుండినను

అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను - 2

అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడే నే - 2

నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే

నా స్తోత్రబలులన్నీ నీకేనయ్యా - 2

నా హృదయాన కొలువైన - యేసయ్యా.....

 

అంతా వ్యర్థమని - వ్యర్థులైరెదరో

నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే - 2

నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెను - 2

నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే

నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును - 2

నా హృదయాన కొలువైన - యేసయ్యా.....

 

విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు

ఎరువు వేసింది ఎవ్వరైననూ - వృదిచేసింది నీవే కదా - 2

సంఘక్షేమాభివృదికే - పరిచర్య ధర్మము నియమించినావే - 2

నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే

నా స్వరము నీకే అర్పింతును - 2

 

నా హృదయాన కొలువైన - యేసయ్యా

నా అణువణువు  నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా

నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే - 2

నీ  సన్నిధిలో పూజార్హుడా

నా హృదయాన కొలువైన - యేసయ్యా  ......

Share:

ఎవరూ సమీపించలేని - Evaru Samipinchaleni lyrics


ఎవరూ సమీపించలేని

ఎవరూ సమీపించలేని

తేజస్సుతో నివసించు నా యేసయ్యా -2

నీ మహిమను ధరించిన పరిశుద్ధులు

నా కంటబడగానే -2

ఏమౌదునో నేనేమౌదునో -2

 

ఇహలోక బంధాలు మరచి

నీ యెదుటే నేను నిలిచి -2

నీవీచుచు బహుమతులు నే స్వీకరించి

నిత్యానందముతో పరవశించు వేళ -2        

||ఏమౌదునో||

పరలోక మహిమను తలచి

నీ పాద పద్మములపై ఒరిగి -2

పరలోక సైన్య సమూహాలతో కలసి

నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ -2        

||ఏమౌదునో||

జయించిన వారితో కలిసి

నీ సింహాసనము నే చేరగా -2

ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో

నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ -2        

||ఏమౌదునో||

Share:

సర్వాంగ సుందరా - Sarvanga Sundara


సర్వాంగ సుందరా

సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2

నా ప్రార్ధన ఆలకించు వాడా – నా కన్నీరు తుడుచు వాడా
నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా
                                                       

||సర్వాంగ||

నా శాపములు బాపి నావా – నా ఆశ్రయ పురమైతివా
నా నిందలన్నిటిలో యెహోషపాతువై
నాకు న్యాయము తీర్చితివా
                                               

||సర్వాంగ||

నా అక్కరలు తీర్చి నావా – నీ రెక్కల నీడకు చేర్చి నావా
నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై
నా జయ ధ్వజమైతివా
                                                         

||సర్వాంగ||

 

Share: