Showing posts with label aa. Show all posts
Showing posts with label aa. Show all posts

Friday, 5 June 2020

ఆనందమే పరమానందమే - Aanandame Paramaanandame


ఆనందమే పరమానందమే

ఆనందమే పరమానందమే

ఆశ్రయపురమైన యేసయ్యా నీలో -2

ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన

అక్షయుడా నీకే స్తోత్రము -2      

||ఆనందమే||

పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే

జీవ జలములు త్రాగనిచ్చితివే -2

నా ప్రాణమునకు సేదదీర్చితివి

నీతియు శాంతియు నాకిచ్చితివే -2      

||ఆనందమే||

గాఢాంధకారము లోయలలో నేను

సంచరించినా దేనికి భయపడను -2

నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును

అనుదినం అనుక్షణం కాపాడునే -2      

||ఆనందమే||

 

నా శత్రువుల ఎదుటే నీవు

నాకు విందును సిద్ధము చేసావు -2

నీతో నేను నీ మందిరములో

నివాసము చేసెద చిరకాలము -2      

||ఆనందమే||

Share:

ఆనంద యాత్ర - Ananda Yatra...


ఆనంద యాత్ర

ఆనంద యాత్ర

ఇది ఆత్మీయ యాత్ర

యేసుతో నూతన

యెరుషలేము యాత్ర

మన.. యేసుతో నూతన

యెరుషలేము యాత్ర             

||ఆనంద యాత్ర||

యేసుని రక్తము

పాపములనుండి విడిపించెను -2

వేయి నోళ్ళతో స్తుతించినను

తీర్చలేము ఆ ఋణమును -2    

||ఆనంద యాత్ర||

రాత్రియు పగలును

పాదములకు రాయి తగలకుండా -2

మనకు పరిచర్య చేయుట కొరకై

దేవదూతలు మనకుండగా -2    

||ఆనంద యాత్ర||

కృతజ్ఞత లేని వారు

వేలకొలదిగ కూలినను -2

కృపా వాక్యమునకు సాక్షులమై

కృప వెంబడి కృప పొందెదము -2

||ఆనంద యాత్ర||

ఆనందం ఆనందం

యేసుని చూచే క్షణం ఆసన్నం

ఆత్మానంద భరితులమై

ఆగమనాకాంక్షతో సాగెదం    

||ఆనంద యాత్ర||

Share:

Thursday, 4 June 2020

ఆశ్చర్యాకరుడా - Aascharyakaruda


ఆశ్చర్యాకరుడా

నా ఆలోచన కర్తవు -2

నిత్యుడగు తండ్రివి

నా షాలేము రాజువు -2

 

సింహపు పిల్లలైనా

కొదువ కలిగి ఆకలిగొనినా -2

నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా

నీవున్నంతవరకు -2        

||ఆశ్చర్యాకరుడా||

విత్తని పక్షులను

నిత్యము పోషించుచున్నావు -2

నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా

నీవున్నంతవరకు -2        

||ఆశ్చర్యాకరుడా||

చీకటి తొలగే

నీతి సూర్యుడు నాలో ఉదయించె -2

నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను

నీవున్నంతవరకు -2        

||ఆశ్చర్యాకరుడా||

Share:

Thursday, 28 May 2020

ఆలయంలో ప్రవేశించండి అందరు - Aalayamlo Pravesinchandi andaru


ఆలయంలో ప్రవేశించండి అందరు

ఆలయంలో ప్రవేశించండి అందరు

స్వాగతం సుస్వాగతం యేసు నామంలో

మీ బ్రతుకులో పాపమా కలతలా

మీ హృదయంలో బాధలా కన్నీరా

మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం       

||ఆలయంలో||

దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై

వెదికే వారికంతా కనబడు దీపము

యేసు రాజు మాటలే వినుట ధన్యము

వినుట వలన విశ్వాసం అధికమధికమై

ఆత్మలో దాహము తీరెను రారండి

ఆనందమానందం హల్లెలూయా      

||ఆలయంలో||

ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై

జీవ వృక్షంబుగా ఫలియించాలని

పెదవితో పలికెదం మంచి మాటలే

హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై

నింపెదం నిండెదం కోరెదం పొందెదం

ఆనందమానందం హల్లెలూయా         

||ఆలయంలో||


Share:

Tuesday, 26 May 2020

ఆరాధన స్తుతి ఆరాధన - Aaradhana Stuthi Aaradhana


ఆరాధన స్తుతి ఆరాధన


ఆరాధన స్తుతి ఆరాధన -3
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని         

||ఆరాధన||

అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన
స్తెఫను వలె ఆరాధన -2

ఆరాధన స్తుతి ఆరాధన -2
పదివేలలోన అతి సుందరుడా
నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని        

||ఆరాధన||

దానియేలు సింహపు బోనులో
చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన
దావీదు ఆరాధన -2

ఆరాధన స్తుతి ఆరాధన -2
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని        

||ఆరాధన||

Share:

Saturday, 2 June 2018

ఆగిపోదు నా పాట - Aagipodu naa Paata

ఆగిపోదు నా పాట

పల్లవి :

ఆగిపోదు నా పాట - గమ్యం చేరేదాక
సాగుతుంది ప్రతిపూట - నా పరుగు ముగిసేదాక

చరణం 1  :

లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను 
అలసటతో జోగినా శృతి తగ్గనీయను 
ఎదురైన అవరోధం యేసే తొలగించును 
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును  

చరణం 2  :

నా అడుగు జారినా కలవరము చెందను 
నా బలము పోయినా లయ తగ్గనీయను 
ఎదురైన అవరోధం యేసే తొలగించును 
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును  

చరణం 3  :

శత్రువు ఎదురొచ్చిన ధైర్యమును వీడను 
మిత్రులు నను గుచ్చినా శ్రావ్యత పొనీయను 
ఎదురైన అవరోధం యేసే తొలగించును 
స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును
Share:
Categories

Friday, 1 June 2018

ఆహా మహాత్మహా శరణ్య - Aaha Mahathmaha Saranya lyrics

ఆహా మహాత్మహా శరణ్య

పల్లవి :

ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా 

చరణం 1  :

వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై  

చరణం 2  :

నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి  

చరణం 3  :

అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి

చరణం 4  :

నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా

చరణం 5  :

దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా  

చరణం 6  :

శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా

చరణం 6  :

అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా    
Share:
Categories

ఆశ్రయదుర్గమా నా యేసయ్యా - Asryadurgama naa yesayya lyrics

ఆశ్రయదుర్గమా నా యేసయ్యా

పల్లవి :

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా
నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా
ఊహించలేనే నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే

చరణం 1  :

లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే
ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే 
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి

చరణం 2  :

నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే 
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి

చరణం 3  :

పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద 
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి

చరణం 4  :

నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది 
స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా
Share:
Categories

ఆరాధన ఆరాధన - Aaradhana Aaradhana lyrics

ఆరాధన ఆరాధన

పల్లవి :

ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన (4)
యేసయ్య ఆరాధన…

చరణం 1  :

ఆరాధన ఆరాధన మెస్సయ్య ఆరాధన (4)
మెస్సయ్య ఆరాధన…

చరణం 2  :

ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన (4)
పరిశుద్ధుని ఆరాధన…

చరణం 3  :

ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన (4)
పరలోక ఆరాధన…
Share:
Categories

ఆనందింతు నీలో దేవా - Aanandinthu neelo Deva lyrics

ఆనందింతు నీలో దేవా

పల్లవి :

ఆనందింతు నీలో దేవా
అనుదినం నిను స్తుతించుచు 
మధురమైన నీ నామమునే 
మరువక ధ్యానించెద ప్రభువా 

చరణం 1  :

ఆత్మ నాథా అదృశ్య దేవా
అఖిల చరాలకు ఆధారుండా 
అనయము నిను మది కొనియాడుచునే
ఆనందింతు ఆశ తీర 

చరణం 2  :

నాదు జనములు నను విడచినను
నన్ను నీవు విడువకుండా 
నీ కను దృష్టి నాపై నుంచి
నాకు రక్షణ శృంగమైన

చరణం 3  :

శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
మేఘమందు రానైయున్న 
ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
అంతం వరకును భద్రపరచుము 

చరణం 4  :

శ్రమలు నన్ను చుట్టిన వేళ
చింతలో కృశించిన వేళ 
అభయముగా నీ దర్శనమిచ్చి
శ్రమలు బాపి శాంతినిచ్చితివి
Share:
Categories

ఆలయంలో ప్రవేశించండి అందరు - Aalayamlo Pravesinchandi Andaru lyrics

ఆలయంలో ప్రవేశించండి అందరు

పల్లవి :

ఆలయంలో ప్రవేశించండి అందరు
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం

చరణం 1  :

దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదికే వారికంతా కనబడు దీపము
యేసు రాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికమై
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమానందం హల్లెలూయా 

చరణం 2  :

ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరెదం పొందెదం
ఆనందమానందం హల్లెలూయా
Share:
Categories

ఆనంద యాత్ర - Ananda Yatra lyrics

ఆనంద యాత్ర

పల్లవి :

ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన
యెరుషలేము యాత్ర
మన.. యేసుతో నూతన
యెరుషలేము యాత్ర  

చరణం 1  :

యేసుని రక్తము
పాపములనుండి విడిపించెను 
వేయి నోళ్ళతో స్తుతించినను
తీర్చలేము ఆ ఋణమును

చరణం 2  :

రాత్రియు పగలును
పాదములకు రాయి తగలకుండా 
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా 

చరణం 3  :

కృతజ్ఞత లేని వారు
వేలకొలదిగ కూలినను 
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృప పొందెదము

చరణం 4  :

ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమనాకాంక్షతో సాగెదం
Share:
Categories