Showing posts with label HIT SONGS. Show all posts
Showing posts with label HIT SONGS. Show all posts

Thursday, 28 May 2020

ఆలయంలో ప్రవేశించండి అందరు - Aalayamlo Pravesinchandi andaru


ఆలయంలో ప్రవేశించండి అందరు

ఆలయంలో ప్రవేశించండి అందరు

స్వాగతం సుస్వాగతం యేసు నామంలో

మీ బ్రతుకులో పాపమా కలతలా

మీ హృదయంలో బాధలా కన్నీరా

మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం       

||ఆలయంలో||

దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై

వెదికే వారికంతా కనబడు దీపము

యేసు రాజు మాటలే వినుట ధన్యము

వినుట వలన విశ్వాసం అధికమధికమై

ఆత్మలో దాహము తీరెను రారండి

ఆనందమానందం హల్లెలూయా      

||ఆలయంలో||

ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై

జీవ వృక్షంబుగా ఫలియించాలని

పెదవితో పలికెదం మంచి మాటలే

హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై

నింపెదం నిండెదం కోరెదం పొందెదం

ఆనందమానందం హల్లెలూయా         

||ఆలయంలో||


Share:

Wednesday, 27 May 2020

నీ దయలో నేనున్న ఇంత కాలం - Nee Dayalo Nenunna Inthakalam


నీ దయలో నేనున్న ఇంత కాలం

నీ దయలో నేనున్న ఇంత కాలం

నీ కృపలో దాచినావు గత కాలం -2

నీ దయ లేనిదే నేనేమౌదునో -2

తెలియదయ్యా......         

||నీ దయలో||

తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో

చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా -2

నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా

నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా

నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని

నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని          

||నీ దయలో||

నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు

అపవాది కోరలకు అంటకుండ దాచావు -2

నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము

ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు

నీ పాదాల చెంతనే నే పరవశించాలని

నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని          

||నీ దయలో||


Share:

ప్రియ యేసు రాజును నే - Priya Yesu Rajunu ne Chuchina chalu


ప్రియ యేసు రాజును నే

ప్రియ యేసు రాజును నే చూచిన చాలు

మహిమలో నేనాయనతో ఉంటే చాలు -2

నిత్యమైన మోక్షగృహము నందు చేరి

భక్తుల గుంపులో హర్షించిన చాలు -2            

||ప్రియ యేసు||

యేసుని రక్తమందు కడుగబడి

వాక్యంచే నిత్యం భద్రపరచబడి -2

నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను -2

బంగారు వీదులలో తిరిగెదను -2                  

||ప్రియ యేసు||

ముండ్ల మకుటంబైన తలను జూచి

స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ -2

కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి -2

ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ -2      

||ప్రియ యేసు||

హృదయము స్తుతులతో నింపబడెను

నా భాగ్య గృహమును స్మరించుచు -2

హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ -2

వర్ణింప నా నాలుక చాలదయ్యా -2                 

||ప్రియ యేసు||

ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో

ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో -2

తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో -2

ఆశతో వేచియుండే నా హృదయం -2              

||ప్రియ యేసు||


Share:

నమ్మకు ఇలలో ఎవరిని - Nammakau ilalo Evarini


నమ్మకు ఇలలో ఎవరిని

నమ్మకు ఇలలో ఎవరిని

సాయం చేస్తారనుకొని -2

నమ్ముకో రక్షకుడేసుని -2

కార్యం చూడు నిలుచొని -2        

||నమ్మకు||

సహాయము చేస్తామని వస్తారు ఎందరో నీ చెంతకు

చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు

అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు -2

శవాలపై కాసులేరాలని కాచుకొని చూస్తుంటారు -2       

||నమ్మకు||

నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమౌతారు వెనువెంటనే

మేముండగా నీకేమని వెన్నంటి ఉంటారు నీ ఇంటనే

నీకున్న అవసరతలన్ని వారిపై వేసుకుంటారు -2

దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు -2       

||నమ్మకు||

నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు నీ సంగతి

జవాబును చూపిస్తామని పేలుస్తు ఉంటారులే కుంపటి

సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు -2

రహస్యాలను బయటేసి నిను అల్లరి చేస్తుంటారు -2       

||నమ్మకు||


Share:

Tuesday, 26 May 2020

ఆరాధన స్తుతి ఆరాధన - Aaradhana Stuthi Aaradhana


ఆరాధన స్తుతి ఆరాధన


ఆరాధన స్తుతి ఆరాధన -3
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని         

||ఆరాధన||

అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన
స్తెఫను వలె ఆరాధన -2

ఆరాధన స్తుతి ఆరాధన -2
పదివేలలోన అతి సుందరుడా
నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని        

||ఆరాధన||

దానియేలు సింహపు బోనులో
చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన
దావీదు ఆరాధన -2

ఆరాధన స్తుతి ఆరాధన -2
నీవంటి వారు ఒక్కరును లేరు
నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని        

||ఆరాధన||

Share:

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా - Priyamaina Yesayya Premake Roopama


ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా
 (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ
 (2)        

||ప్రియమైన||

జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా
 (2)      

||నా ప్రియుడా||

ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే
 (2)      

||నా ప్రియుడా||

ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం
 (2)      

||నా ప్రియుడా||



Share:

నిబంధనా జనులం - Nibandhana Janulam



నిబంధనా జనులం

 

నిబంధనా జనులం

నిరీక్షణా ధనులం

ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం

మేము నిబంధనల జనులం

యేసు రాజు వచ్చును - ఇంకా కొంత కాలమే

మోక్షమందు చేరెదము -2          

||నిబంధనా||

అబ్రాహాము నీతికి వారసులం

ఐగుప్తు దాటిన అనేకులం -2

మోషే బడిలో బాలురము -2

యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం - ప్రియ పుత్రులం

మేము నిబంధనా జనులం          

||యేసు రాజు||

విశ్వాసమే మా వేదాంతం

నిరీక్షణే మా సిద్ధాంతం -2

వాక్యమే మా ఆహారం -2

ప్రార్ధనే వ్యాయామం - అనుదినము

మేము నిబంధనా జనులం          

||యేసు రాజు||

అశేష ప్రజలలో ఆస్తికులం

అక్షయుడేసుని ముద్రికులం -2

పునరుత్తానుని పత్రికలం -2

పరిశుద్ధాత్ముని గోత్రికులం - యాత్రికులం

మేము నిబంధనా జనులం          

||యేసు రాజు||

 

నజరేయుని ప్రేమ పొలిమేరలో

సహించుటే మా ఘన నియమం -2

క్షమించుటే ఇల మా న్యాయం -2

భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం

మేము నిబంధనా జనులం          

||యేసు రాజు||

 

క్రీస్తేసే మా భక్తికి పునాది

పునరుత్తానుడే ముక్తికి వారధి -2

పరిశుద్ధాత్ముడే మా రథ సారథి -2

ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి

మేము నిబంధనా జనులం          

||యేసు రాజు||

 

ఎవరీ యేసుని అడిగేవో

ఎవరోలే యని వెళ్ళేవో -2

యేసే మార్గం యేసే జీవం -2

యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం

నిబంధనా జనులం          

||యేసు రాజు||

-రాజ బాబు 


Share:

Monday, 25 May 2020

భాసిల్లెను సిలువలో పాపక్షమా - BHASILLENU SILUVALO PAPAKSHAMA


భాసిల్లెను సిలువలో పాపక్షమా


భాసిల్లెను సిలువలో పాపక్షమా

యేసు ప్రభూ నీ దివ్య క్షమా     

||భాసిల్లెను||

కలువరిలో నా పాపము పొంచి

సిలువకు నిన్ను యాహుతి చేసి

కలుషహరా కరుణించితివి (2)     

||భాసిల్లెను||

దోషము చేసినది నేనెకదా

మోసముతో బ్రతికిన నేనెకదా

మోసితివా నా శాపభారం (2)    

||భాసిల్లెను||

పాపము చేసి గడించితి మరణం

శాపమెగా నేనార్జించినది

కాపరివై నను బ్రోచితివి (2)    

||భాసిల్లెను||

నీ మరణపు వేదన వృధా గాదు

నా మది నీ వేదనలో మునిగెను

క్షేమము కలిగెను హృదయములో (2)    

||భాసిల్లెను||

ఎందులకో నాపై ఈ ప్రేమ

అందదయ్యా స్వామీ నా మదికి

అందులకే భయమొందితిని (2)    

||భాసిల్లెను||

నమ్మిన వారిని కాదన వనియు

నెమ్మది నొసగెడి నా ప్రభుడవని

నమ్మితి నీ పాదంబులను (2)     

||భాసిల్లెను||  


   


Share:

భూపునాది మునుపే - BHOOPUNADI MUNIPE LYRICS

భూపునాది మునుపే 

భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే

ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు

కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే

ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు

నూతనాకాశము.. నూతన లోకము…

నూతనెరుషలేము వచ్చును

దేవుడే మనతో.. గుడారమై యుండును…

మనమంతా మరలా పాడెదము     

||భూపునాది||

 

జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే

నిత్యము మనలో ఉందును (2)

తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు

మనతో ఏకమై యుండును    

||భూపునాది||

 

వేదన బాధయు – కన్నీరు దుఃఖము

ఇంకెక్కడా ఉండే ఉండవు (2)

సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు

దేవుడే వెలుగై యుండును     

||భూపునాది||




Share:

హీనమైన బ్రతుకు నాది - Heenamaina Brathuku Naadi Lyrics

హీనమైన బ్రతుకు నాది 

హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2)

దాపు జేరితిని శరణు కోరితిని

దిక్కు నీవే నాకు ఇలలో

లేరు ఎవ్వరు నాయను వారు     

||హీనమైన||

 

మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత

మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2)

కరుణించి నన్ను కష్టాలు బాపు (2)

కరుణామయా క్రీస్తేసువా     

||హీనమైన||

 

తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ

భార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ (2)

పాపి కొరకు ప్రాణమర్పించిన (2)

త్యాగ శీలివి నీకే స్తోత్రము       

||హీనమైన||

 

నిన్న నేడు రేపు యేసు – మారనే మారవు

లోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు (2)

వెరువను జడియను (2)

నీ కంటి పాపను నను కాచే దైవమా        

||హీనమైన||



Share:

నన్నెంతగా ప్రేమించితివో - Nannenthaga preminchitivo


నన్నెంతగా ప్రేమించితివో

నన్నెంతగా ప్రేమించితివో
నిన్నంతగా దూషించితినో
నన్నెంతగా నీవెరిగితివో
నిన్నంతగా నే మరచితినో
గలనా! నే చెప్పగలనా!
దాయనా! నే దాయగలనా! 
 -2
అయ్యా........నా యేసయ్యా
నాదం  తాళం  రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము
 -2

1.    ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో
 -2
ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో
 -2                                

||గలనా||

2.     ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో
 -2
ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో
 -2   

||గలనా||


Share:

అంకితం ప్రభూ నా జీవితం - Ankitham Prabhu Naa Jeevitham


అంకితం ప్రభూ నా జీవితం

అంకితం ప్రభూ నా జీవితం – నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)
నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు రక్షకా
 (2)

మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు
 (2)
అంగీకరించుము నా సమర్పణ
                                                                                ||అంకితం||

కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార ఛాయలను తొలగించుటకు
 (2)
అంగీకరించుము నా సమర్పణ
                                                                                                                ||అంకితం||

 

Share: