Showing posts with label na. Show all posts
Showing posts with label na. Show all posts

Monday, 21 September 2020

నిన్ను నేను విడువనయ్య - Ninnu Nenu Viduvanayya

నిన్ను నేను విడువనయ్య 


నిన్ను నేను విడువనయ్య నీదు ప్రేమన్ మరువనయ్య

నీ దయలోనే నన్ను బ్రతికించయ్య నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్య

జీవితమే నీదు వరమయ్య నీదు మేళ్ళన్ నేను మరువనయ్య

 

కష్టాలలో నేనుండగా నావారే దూషించగా వేదనతో చింతించెగా దేవా -2

నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య

నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్య

||నిన్ను||

 

సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా దయతో రక్షించయ్య దేవా -2

నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య

నీవే నా సర్వం నీవే నా సకలం నీవే నీ తోడుతోనే నను బ్రతికించయ్య

||నిన్ను||

Sharing is Caring 

Share:

Thursday, 2 July 2020

నా బ్రతుకు దినములు - Naa Brathuku Dinamulu lyrics

నా బ్రతుకు దినములు

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము

దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము

ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము

నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము

 

ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి

నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని

ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని

ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని

నా మరణ రోదన ఆలకించుమో ప్రభు

మరల నన్ను నూతనముగా చిగురువేయనీ

 

నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి

నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను

నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది

దేవా నన్ను మన్నించుము  నా బ్రతుకు మార్చుము

యేసు నీచేతికి ఇక లొంగిపోదును

విశేషముగా రూపించుము నా శేషజీవితం

-       Joel Kodali

Naa Brathuku Dinamulu lyrics

Share:

Friday, 5 June 2020

నేనెందుకని నీ సొత్తుగా మారితిని - Nenendukani nee Sothugaa maarithini


నేనెందుకని నీ సొత్తుగా మారితిని

నేనెందుకని నీ సొత్తుగా మారితిని

యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున

నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ

 

నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే

నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే

అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును           

||నేనె||

నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే

నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే

అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును             

||నేనె||

నీలో నేనుండుటే – నాలో నీవుండుటే – నా ఆత్మీయ అనుభవమే

పరిశుద్ధాత్ముని అభిషేకముతో – నే పరిపూర్ణత చేందెద

అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును              

|| నేనె||

Share:

నా ప్రాణమా నాలో నీవు - Naa Pranama Naalo Neevu


నా ప్రాణమా నాలో నీవు

నా ప్రాణమా నాలో నీవు

ఎందుకు కృంగియున్నావు

యెహోవాయందే ఇంకను

నిరీక్షణ ఉంచుము నీవు -2

||నా ప్రాణమా||

ఈతి బాధల్ కఠిన శ్రమలు

అవమానములే కలిగిన వేళ -2

నీ కొరకే బలియైన యేసు

సిలువను గూర్చి తలపోయుమా -2

అల్పకాల శ్రమల పిదప

మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా -2

||నా ప్రాణమా||

ఆప్తులంతా నిను వీడిననూ

శత్రువులే నీపై లేచిననూ -2

తల్లి అయినా మరచినా మరచున్

నేను నిన్ను మరువాననినా -2

యేసుని ప్రేమన్ తలపోయుమా

ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా -2

||నా ప్రాణమా||

ఐశ్వర్యమే లేకున్ననూ

సౌఖ్య జీవితమే కరువైననూ -2

ప్రభు సేవలో ప్రాణములనే

అర్పించవలసి వచ్చిననూ -2

క్రీస్తునికే అంకితమై ఆనందించు

ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా -2

||నా ప్రాణమా||

Share:

నా హృదయాన కొలువైన యేసయ్యా - Naa Hrudayana koluvaina Yesayya


నా హృదయాన కొలువైన యేసయ్యా

నా హృదయాన కొలువైన - యేసయ్యా

నా అణువణువు  నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా

నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే

నీ  సన్నిధిలో పూజార్హుడా - 2

నా హృదయాన కొలువైన - యేసయ్యా.....

 

అగ్ని ఏడంతలై - మండుచుండినను

అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను - 2

అగ్ని బలము చల్లారెనే - శత్రు సమూహము అల్లాడే నే - 2

నేను నీ స్వాస్థ్యమే - నీవు నా సొంతమే

నా స్తోత్రబలులన్నీ నీకేనయ్యా - 2

నా హృదయాన కొలువైన - యేసయ్యా.....

 

అంతా వ్యర్థమని - వ్యర్థులైరెదరో

నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే - 2

నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెను - 2

నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే

నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును - 2

నా హృదయాన కొలువైన - యేసయ్యా.....

 

విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు

ఎరువు వేసింది ఎవ్వరైననూ - వృదిచేసింది నీవే కదా - 2

సంఘక్షేమాభివృదికే - పరిచర్య ధర్మము నియమించినావే - 2

నీ ఉపదేశమే - నన్ను స్థిరపరచెనే

నా స్వరము నీకే అర్పింతును - 2

 

నా హృదయాన కొలువైన - యేసయ్యా

నా అణువణువు  నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా

నా హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే - 2

నీ  సన్నిధిలో పూజార్హుడా

నా హృదయాన కొలువైన - యేసయ్యా  ......

Share:

Thursday, 4 June 2020

నా జీవం నీ కృపలో - Naa Jeevam Nee Krupalo



నా జీవం నీ కృపలో

నా జీవం నీ కృపలో దాచితివే

నా జీవిత కాలమంతా

ప్రభువా నీవే నా ఆశ్రయం

నా ఆశ్రయం       

 ||నా జీవం||

పాపపు ఊబిలో పడి కృంగిన నాకు

నిత్య జీవమిచ్చితివే -2

పావురము వలె నీ సన్నిధిలో

జీవింప పిలచితివే -2      

||నా జీవం||

ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము

అడ్డురానే వచ్చెనే -2

నీ బాహు బలమే నన్ను దాటించి

శత్రువునే కూల్చెనే -2      

||నా జీవం||

కానాను యాత్రలో యొర్దాను అలలచే

కలత చెందితినే -2

కాపరివైన నీవు దహించు అగ్నిగా

నా ముందు నడచితివే -2      

||నా జీవం||

వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము

నన్ను వెంటాడెనే -2

వాక్యమైయున్న నీ సహవాసము

ధైర్యము పుట్టించెనే -2      

||నా జీవం||

స్తుతుల మధ్యలో నివసించువాడా

స్తుతికి పాత్రుడా -2

స్తుతి యాగముగా నీ సేవలో

ప్రాణార్పణ చేతునే -2      

||నా జీవం||

Share:

నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా - Naa Yesu Raja Naa Aaradhya Daivama


నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా

నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా

ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా

నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా

నా యేసు రాజా రాజా ....రాజా ......రాజా........

రాజా రాజా యేసు రాజా

రాజా రాజా యేసు రాజా

రాజా యేసు రాజా -2

 

నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము

నన్ను బంధించెనా -2

నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా -2      

||నా యేసు||

వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన

కనికర స్వరూపుడా -2

నా కన్నీటిని నాట్యముగా మార్చితివా -2     

||నా యేసు||

అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే

నా నీటి ఊట నీవే -2

అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద -2     

||నా యేసు||

Share:

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు - Naa Deepamu Yesayya Neevu Veliginchinavu


నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు

సుడిగాలిలోనైనా జడి వానలోనైనా

ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము

నీవు వెలిగించిన దీపము -2

 

ఆరని దీపమై దేదీప్యమానమై

నా హృదయ కోవెలపై దీపాల తోరణమై -2

చేసావు పండుగ వెలిగావు నిండుగా -2       

||నా దీపము||

మారని నీ కృప నను వీడనన్నది

మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది -2

మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా -2       

||నా దీపము||

ఆగని హోరులో ఆరిన నేలపై

నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై -2

పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా -2       

||నా దీపము||

Share:

Thursday, 28 May 2020

నీదు ప్రేమకు హద్దు లేదయా - Needu Premaku Haddu ledayya


నీదు ప్రేమకు హద్దు లేదయా

నీదు ప్రేమకు హద్దు లేదయా
నీదు ప్రేమకు కొలత లేదయా
నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు
పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా

||నీదు||

తల్లి తండ్రులు చూపలేని ప్రేమ
తనయులివ్వని తేటనైన ప్రేమ -2
పేదలకు నిరు పేదలకు
విధవలకు అనాథలకు -2
బంధు మిత్రులు చూపలేని ప్రేమా -2
కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా      

||నీదు||

నరులకై నర రూపమైన ప్రేమ
పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ -2
దొంగలకు వ్యభిచారులకును
కౄరులకు నర హంతకులకు
మనుజులివ్వని మధురమైన ప్రేమా -2
కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా      

||నీదు||

 


Share:

Wednesday, 27 May 2020

నీవుంటే నాకు చాలు యేసయ్యా - Neevunte naku chalu Yesayya


నీవుంటే నాకు చాలు యేసయ్యా

నీవుంటే నాకు చాలు యేసయ్యా

నీవెంటే నేను ఉంటానేసయ్యా -2

నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా

నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా -2        

||నీవుంటే||

ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ

ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ -2         

||నీ మాట||

బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ

అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా -2   

||నీ మాట||

ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా

ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా -2       

||నీ మాట||

నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము

నీదు కృపతో నాకేమియు కాదిల సమానము -2

||నీ మాట||


Share:

నిత్యము స్తుతించినా - Nithyamu Stutiyinchina


నిత్యము స్తుతించినా

నిత్యము స్తుతించినా

నీ ఋణము తీర్చలేను

సమస్తము నీకిచ్చినా

నీ త్యాగము మరువలేను -2

 

రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు

దేవా దేవా దేవాది దేవుడవు -2

||నిత్యము||

అద్వితీయ దేవుడా

ఆది అంతములై యున్నవాడా -2

అంగలార్పును నాట్యముగా

మార్చివేసిన మా ప్రభు -2

||రాజా||

 

జీవమైన దేవుడా

జీవమిచ్చిన నాథుడా -2

జీవజలముల బుగ్గ యొద్దకు

నన్ను నడిపిన కాపరి -2

||రాజా||

మార్పులేని దేవుడా

మాకు సరిపోయినవాడా -2

మాటతోనే సృష్టినంతా

కలుగజేసిన పూజ్యుడా -2

||రాజా||


Share:

నీ దయలో నేనున్న ఇంత కాలం - Nee Dayalo Nenunna Inthakalam


నీ దయలో నేనున్న ఇంత కాలం

నీ దయలో నేనున్న ఇంత కాలం

నీ కృపలో దాచినావు గత కాలం -2

నీ దయ లేనిదే నేనేమౌదునో -2

తెలియదయ్యా......         

||నీ దయలో||

తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో

చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా -2

నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా

నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా

నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని

నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని          

||నీ దయలో||

నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు

అపవాది కోరలకు అంటకుండ దాచావు -2

నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము

ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు

నీ పాదాల చెంతనే నే పరవశించాలని

నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని          

||నీ దయలో||


Share:

Tuesday, 26 May 2020

నిబంధనా జనులం - Nibandhana Janulam



నిబంధనా జనులం

 

నిబంధనా జనులం

నిరీక్షణా ధనులం

ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం

మేము నిబంధనల జనులం

యేసు రాజు వచ్చును - ఇంకా కొంత కాలమే

మోక్షమందు చేరెదము -2          

||నిబంధనా||

అబ్రాహాము నీతికి వారసులం

ఐగుప్తు దాటిన అనేకులం -2

మోషే బడిలో బాలురము -2

యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం - ప్రియ పుత్రులం

మేము నిబంధనా జనులం          

||యేసు రాజు||

విశ్వాసమే మా వేదాంతం

నిరీక్షణే మా సిద్ధాంతం -2

వాక్యమే మా ఆహారం -2

ప్రార్ధనే వ్యాయామం - అనుదినము

మేము నిబంధనా జనులం          

||యేసు రాజు||

అశేష ప్రజలలో ఆస్తికులం

అక్షయుడేసుని ముద్రికులం -2

పునరుత్తానుని పత్రికలం -2

పరిశుద్ధాత్ముని గోత్రికులం - యాత్రికులం

మేము నిబంధనా జనులం          

||యేసు రాజు||

 

నజరేయుని ప్రేమ పొలిమేరలో

సహించుటే మా ఘన నియమం -2

క్షమించుటే ఇల మా న్యాయం -2

భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం

మేము నిబంధనా జనులం          

||యేసు రాజు||

 

క్రీస్తేసే మా భక్తికి పునాది

పునరుత్తానుడే ముక్తికి వారధి -2

పరిశుద్ధాత్ముడే మా రథ సారథి -2

ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి

మేము నిబంధనా జనులం          

||యేసు రాజు||

 

ఎవరీ యేసుని అడిగేవో

ఎవరోలే యని వెళ్ళేవో -2

యేసే మార్గం యేసే జీవం -2

యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం

నిబంధనా జనులం          

||యేసు రాజు||

-రాజ బాబు 


Share: