Showing posts with label Jyothi Raju. Show all posts
Showing posts with label Jyothi Raju. Show all posts

Wednesday, 27 May 2020

నీవుంటే నాకు చాలు యేసయ్యా - Neevunte naku chalu Yesayya


నీవుంటే నాకు చాలు యేసయ్యా

నీవుంటే నాకు చాలు యేసయ్యా

నీవెంటే నేను ఉంటానేసయ్యా -2

నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా

నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా -2        

||నీవుంటే||

ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ

ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ -2         

||నీ మాట||

బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ

అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా -2   

||నీ మాట||

ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా

ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా -2       

||నీ మాట||

నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము

నీదు కృపతో నాకేమియు కాదిల సమానము -2

||నీ మాట||


Share:

Sunday, 4 March 2018

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా - Yesayya namamlo Shakti unnadayya lyrics

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా

యేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
శ్రీయేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని 

  • పాపాలను క్షమియించే - శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరిచే - శక్తి కలిగినది యేసయ్య నామం 
  • రోగికి స్వస్థతనిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం 
  • దురాత్మలను పారద్రోలే - శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే - శక్తి కలిగినది యేసయ్య నామం
  •  సృష్టిని శాసించగలిగిన  - శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన  - శక్తి కలిగినది యేసయ్య నామం
  •  పాతాళాన్నీ తప్పించే - శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే - శక్తి కలిగినది యేసయ్య నామం


Share: