Showing posts with label Comforting Songs. Show all posts
Showing posts with label Comforting Songs. Show all posts

Friday, 10 July 2020

కొండలలో లోయలలో - Kondalalo Loyalalo



కొండలలో లోయలలో

అడవులలో ఎడారులలో  -2

నన్ను గమనించినావా

నన్ను నడిపించినావా  -2       

||యేసయ్యా||


యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

నీవే నీవే నా రాజువయ్యా  -2

యేసయ్య యేసయ్య యేసయ్యా....


ఆత్మీయులే నన్ను అవమానించగా

అన్యులు నన్ను అపహసించగా  -2

అండ నీవైతివయ్యా

నా.. కొండ నీవే యేసయ్యా  -2     

||యేసయ్యా||

మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ

నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప  -2

నన్ను బలపరచెనయ్యా

నిన్నే ఘనపరతునయ్యా  -2     

||యేసయ్యా||

వంచెన వంతెన ఒదిగిన భారాన

ఒసగక విసిగిన విసిరె కెరటాన  -2

కలలా కడతేర్చినావా

నీ వలలో నను మోసినావా  -2     

||యేసయ్యా||

Kondalalo Loyalalo lyrics
Original Song by K RAJA BABU GARU

Beautiful heart touching telugu christian song sung by Bro. Prabhu Pammi
NINNE NINNE NE KOLUTHUNAYYA
Share:

Monday, 29 June 2020

Oohinchagalana Song Lyrics - ఊహించగలనా!


ఊహించగలనా  ఈ ప్రణాళికను
 
ఊహించగలనా  ఈ ప్రణాళికను
యోగ్యత లేని నన్ను కరుణించిన కృపను

పాపా శాప భారంతో సొమ్మసిల్లి యుంటిని
ఎటు పయ నించాలో తెలియక యుంటిని
ప్రాణ మిచ్చినానంటూ  సేద దీర్చుకోమంటూ   
తెలుసుకో నన్నంటూ  గమ్యమే నేనంటూ
వచ్చావ యేసయ్య నన్నే ప్రేమించి
తెచ్చావ రక్షణనే నను కనికరించి  
||ఊహించగలనా||
మనసున్న మా రాజా పరలోక రారాజా
సన్నుతించేనయ్యా   నిన్నే నా నాథా
పిలుచుకున్నావయ్యా   మలచుకున్నావయ్యా
నీ సేవ  భారంతో నన్ను  నింపావయ్య
వచ్చాను యేసయ్య నీ పాద సన్నిధికి
తెచ్చాను యేసయ్య నా అర్పణ లన్ని 
||ఊహించగలనా||

-బ్రదర్ వేణు & సిస్టర్ జ్ఞాన ప్రసన్న 
Oohinchagalana lyrics
 
Share:

Thursday, 31 May 2018

ఎండమావులను నీటి మడుగులనుకొని - Endamavulanu Neeti madugulanukoni lyrics

ఎండమావులను నీటి మడుగులనుకొని 

పల్లవి :

ఎండమావులను నీటి మడుగులనుకొని

భ్రమచితి పరుగిడితిని సొమ్మసిల్లి పడితిని

దేవా రావా నన్నాదరించావా

చరణం 1  :

ఎడారి తెన్నెలు నిలువనీడలేకనా

గుడారమందు ఆత్మ అల్లాడిన వేళ

నను రక్షింప మంచి కాపరిగా వచ్చి

అలసిన నాకు నీవు ఆశ్రయమును ఇచ్చి

పచ్చికబయలలో ఆకలి  తీర్చి

జీవజాలముతో దప్పిక  తీర్చి

నీ శాంతిని నాకు  అనుగ్రహించవయ్యా

చరణం 2  :

యెరూషలేము విడచి యెరికోకు దిగువేళ

దొంగల చేతిలో గాయపడి దోచబడగ

నన్నాదరించ మంచి సమరయునిగ వచ్చి

పరమ వైద్యుడవై నా గాయము కట్టి

నీ రూకలిచ్చి ఆకలి తీర్చి

నీ రక్తమిచ్చి నను రక్షించి

నీ ఆశ్రయ కోటలో నను దాచిన యేసయ్య  

Endamavulanu Neeti madugulanukoni lyrics
Share:

Sunday, 8 April 2018

నమ్మకమీయవ ప్రభూ - Nammakameeyava Prabhu lyrics

నమ్మకమీయవ ప్రభూ

పల్లవి :

నమ్మకమీయవ ప్రభూ
స్థిర నమ్మకమీయవ ప్రభూ
నీ అందు దినదినము ఎదిగి
ఆవగింజంత విశ్వాసం కొండంత పెరిగి
నీ పరలోక రాజ్యాన నిత్యజీవం పొందేందుకు 


చరణం 1  :

అడుగుడి ఇయ్యబడునన్నావు ... కనుకనే నిన్నడుగుచున్నాము
మా బ్రతుకు బాధలు తొలగిమ్ము ... లేమి లేని సుఖ జీవం మాకిమ్ము
దిక్కులేని దీనులo ... సుఖమెరుగని గానుగలం
నీ ఒడిలో సేదతీరు సుఖమున్నదిలే 

చరణం 2  :


వెదకుడి దొరకును అన్నావు... కనుకనే నిను వేదకుచున్నాము
నీ దర్శనం మాకు కలిగించు... మా బ్రతుకులో చీకటి తొలగించు
అడుగడుగున వేదనలు .... అన్నిట్లో రోదనలు

నీ నామంలో విశ్రాంతి ఉన్నదిలే 

చరణం 3 :



తట్టుడి తీయబడునన్నావు... కనుకనే నిను తట్టుచున్నాము
నీ పరలోక రాజ్యపు తలుపు తీయి... నువ్వు తోడుంటే మా బ్రతుకు హాయి
బాధలే బ్రతుకులు ... బ్రతుకులే గతుకులు
నీ వెలుగులో నిత్యజీవము ఉన్నదిలే

Share:

Sunday, 4 March 2018

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా - Yesayya namamlo Shakti unnadayya lyrics

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా

యేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
శ్రీయేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని 

  • పాపాలను క్షమియించే - శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరిచే - శక్తి కలిగినది యేసయ్య నామం 
  • రోగికి స్వస్థతనిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం 
  • దురాత్మలను పారద్రోలే - శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే - శక్తి కలిగినది యేసయ్య నామం
  •  సృష్టిని శాసించగలిగిన  - శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన  - శక్తి కలిగినది యేసయ్య నామం
  •  పాతాళాన్నీ తప్పించే - శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే - శక్తి కలిగినది యేసయ్య నామం


Share:

Monday, 5 February 2018

జీవ వాక్యము - Jeeva Vaakyamu lyrics

జీవ వాక్యము

పల్లవి :జీవ వాక్యము ఈ అవనిలో రూపు దాల్చిన వేళ
దివ్య తేజుడు మనుజుడై ఇలా అవతరించిన వేళ


చరణం 1:పాపిని స్వీకరించుటకై పాపములు క్షమించుటకై
పరమునకు చేర్చుటకై పరిమాణముగా మర్చుటకై
ప్రేమమయునిగా జీవింప పరమును విడచిన శుభ వేళ


చరణం 2:పరిశుద్దునిగా చేయుటకై పరాభావాలు విరియుటకై
భువి దివి గా మార్చుటకై ప్రతి ప్రజయై తరియించుటకై
పరమ పవిత్రత సాధింప పరమును విడచిన శుభ వేళ



Share: