Showing posts with label Evergreen songs. Show all posts
Showing posts with label Evergreen songs. Show all posts

Thursday, 4 June 2020

దేవా పాపిని నిన్నాశ్రయించాను - Deva Papini ninnasrayinchanu


దేవా పాపిని నిన్నాశ్రయించాను

దేవా పాపిని నిన్నాశ్రయించాను

ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా -2    

||దేవా||

అపరాధినై అంధుడనై

అపవాదితో అనుచరుడై -2

సంచరించితి చీకటిలో

వంచన చేసితి ఎందరినో -2    

||దేవా||

కలువరిలో సిలువొంద

కలవరమొందె జగమంతా -2

పాపినైన నా కొరకు

మరణమునే భరించితివి

మరణమునే జయించితివి         

||దేవా||

Share:

Friday, 1 June 2018

ఇదిగో దేవా నా జీవితం - Idigo Deva naa Jeevitham lyrics

ఇదిగో దేవా నా జీవితం

పల్లవి :

ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం
 
శరణం నీ చరణం

చరణం 1  :

పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి
 
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం
 

చరణం 2  :

నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము
 
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము
 

చరణం 3  :

విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు
 
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించి ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా
 

Idigo Deva naa Jeevitham
Share:

Sunday, 4 March 2018

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా - Yesayya namamlo Shakti unnadayya lyrics

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా

యేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
శ్రీయేసయ్య నామంలో - శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని 

  • పాపాలను క్షమియించే - శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరిచే - శక్తి కలిగినది యేసయ్య నామం 
  • రోగికి స్వస్థతనిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం 
  • దురాత్మలను పారద్రోలే - శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే - శక్తి కలిగినది యేసయ్య నామం
  •  సృష్టిని శాసించగలిగిన  - శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన  - శక్తి కలిగినది యేసయ్య నామం
  •  పాతాళాన్నీ తప్పించే - శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే - శక్తి కలిగినది యేసయ్య నామం


Share: