పల్లవి :
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం
శరణం నీ చరణం
చరణం 1 :
పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం
చరణం 2 :
నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము
చరణం 3 :
విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించి ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా
Idigo Deva naa Jeevitham
Song is very meaningful melodious and heart touching. Want to know the lyricist and music director.
ReplyDelete