Monday, 29 June 2020
Thursday, 28 May 2020
ఆలయంలో ప్రవేశించండి అందరు - Aalayamlo Pravesinchandi andaru
ఆలయంలో ప్రవేశించండి అందరు
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం
||ఆలయంలో||
దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదికే వారికంతా కనబడు దీపము
యేసు రాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికమై
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమానందం హల్లెలూయా
||ఆలయంలో||
ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరెదం పొందెదం
ఆనందమానందం హల్లెలూయా
||ఆలయంలో||
Wednesday, 27 May 2020
నిత్యము స్తుతించినా - Nithyamu Stutiyinchina
నిత్యము స్తుతించినా
నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా
నీ త్యాగము మరువలేను -2
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు -2
||నిత్యము||
అద్వితీయ దేవుడా
ఆది అంతములై యున్నవాడా -2
అంగలార్పును నాట్యముగా
మార్చివేసిన మా ప్రభు -2
||రాజా||
జీవమైన దేవుడా
జీవమిచ్చిన నాథుడా -2
జీవజలముల బుగ్గ యొద్దకు
నన్ను నడిపిన కాపరి -2
||రాజా||
మార్పులేని దేవుడా
మాకు సరిపోయినవాడా -2
మాటతోనే సృష్టినంతా
కలుగజేసిన పూజ్యుడా -2
||రాజా||
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా - Prardhana Shakti naaku kaavalayya
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా -2
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా -2
|| ప్రార్థన ||
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా -2
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా -2
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా -2
|| ప్రార్థన ||
సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా -2
నీతో నడిచే వరమీయుమా -2
నీ సిలువను మోసే కృపనీయుమా -2
|| ప్రార్థన ||
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా -2
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె -2
ఈ చిన్న వాడిని అభిషేకించు -2
|| ప్రార్థన ||
Thursday, 31 May 2018
ఎండమావులను నీటి మడుగులనుకొని - Endamavulanu Neeti madugulanukoni lyrics
ఎండమావులను నీటి మడుగులనుకొని
పల్లవి
:
ఎండమావులను నీటి మడుగులనుకొని
భ్రమచితి పరుగిడితిని సొమ్మసిల్లి పడితిని
దేవా రావా నన్నాదరించావా
చరణం 1 :
ఎడారి తెన్నెలు నిలువనీడలేకనా
గుడారమందు ఆత్మ అల్లాడిన వేళ
నను రక్షింప మంచి కాపరిగా వచ్చి
అలసిన నాకు నీవు ఆశ్రయమును ఇచ్చి
పచ్చికబయలలో ఆకలి తీర్చి
జీవజాలముతో దప్పిక తీర్చి
నీ శాంతిని నాకు అనుగ్రహించవయ్యా
చరణం 2 :
యెరూషలేము విడచి యెరికోకు దిగువేళ
దొంగల చేతిలో గాయపడి దోచబడగ
నన్నాదరించ మంచి సమరయునిగ వచ్చి
పరమ వైద్యుడవై నా గాయము కట్టి
నీ రూకలిచ్చి ఆకలి తీర్చి
నీ రక్తమిచ్చి నను రక్షించి
నీ ఆశ్రయ కోటలో నను దాచిన యేసయ్య
Saturday, 3 March 2018
అందరూ నన్ను విడచినా - Andaru Nannu vidachina lyrics
అందరూ నన్ను విడచినా
పల్లవి :
అందరూ
నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రివి నీవే యేసయ్యా
నీవు నన్ను విడువనంటివే
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రివి నీవే యేసయ్యా
చరణం 1 :
లోకము
నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే
నా బంధువు నీవే
నా మిత్రువు నీవే
నా బంధు మిత్రువు నీవే యేసయ్యా
నీవు నన్ను విడువనంటివే
నా బంధువు నీవే
నా మిత్రువు నీవే
నా బంధు మిత్రువు నీవే యేసయ్యా
చరణం 2 :
వ్యాధులు
నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా
బాధలు నన్ను ముట్టినా
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా
చరణం 3 :
నన్ను
నీవు ఎన్నుకొంటివే
నీవు భయపడకంటివే
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా
నీవు భయపడకంటివే
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
Thursday, 1 March 2018
అత్యున్నత సింహాసనము పై - Athyunnata Simhasanamupai lyrics
అత్యున్నత సింహాసనముపై
పల్లవి :
అత్యున్నత సింహాసనము పై – ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా
ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్
చరణం 1 :
ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా.... నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా.... నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం
చరణం 2 :
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు
నా రక్షణకర్త స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు
నా రక్షణకర్త స్తోత్రం
చరణం 3 :
స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలు ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలు ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం
చరణం 4 :
మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం
చరణం 5 :
ఆమెన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం
Sunday, 25 February 2018
దైవమే నీ చేయి విడిచిన - Daivame nee Cheyi Vidachina lyrics
పల్లవి :
దైవమే నీ చేయి విడిచిన
నీ విభుడే నిను మరచెనా
ఈ పాప లోకం నిను విడిచేనా
అన్యాయముగా బలియైనావా
చరణం 1 :
నీతికి నిలిచిన నీ నామమున
దుష్టత్వముతో నిందలు వేసేనా
కరుణను చూపిన నీ మోముపైన
క్రూరత్వముతో
ఉమ్మివేసెనా
ముళ్ళకిరీటము
గ్రుచ్చెనా
హేళన చేసి హిoసించితిరా
చరణం 2 :
దైవ కుమారుని దేహము చీలగా
రుధిరము ధారలై ప్రవహించెనా
అయ్యో దేవా దాహపడితివా
నీ దాహమునే తీర్చలేదా
పగలే రాత్రిగా మారేనా
నీ ప్రాణమును కొనిపోయెనా
పల్లవి :
దైవమే నీ చేయి విడిచిన
నీ విభుడే నిను మరచెనా
ఈ పాప లోకం నిను విడిచేనా
అన్యాయముగా బలియైనావా
చరణం 1 :
నీతికి నిలిచిన నీ నామమున
దుష్టత్వముతో నిందలు వేసేనా
కరుణను చూపిన నీ మోముపైన
క్రూరత్వముతో
ఉమ్మివేసెనా
ముళ్ళకిరీటము
గ్రుచ్చెనా
హేళన చేసి హిoసించితిరా
చరణం 2 :
దైవ కుమారుని దేహము చీలగా
రుధిరము ధారలై ప్రవహించెనా
అయ్యో దేవా దాహపడితివా
నీ దాహమునే తీర్చలేదా
పగలే రాత్రిగా మారేనా
నీ ప్రాణమును కొనిపోయెనా
Wednesday, 7 February 2018
లోకపాలక యేసునాధ - Lokapalaka Yesu Naadha lyrics
లోకపాలక యేసునాధ
పల్లవి :
లోకపాలక యేసునాధసతతము నిన్నే ధ్యానింతును
ధన్య ధన్యమౌ నీదు నామం
నిన్నే నమ్మిన జీవితము
లోకపాపం తీసివేయ పాపి కొరకై జన్మించెను
లోకపాపం తీసివేయ పాపి కొరకై అరుదెంచెను
చరణం 1 :
ఇరులు గొలిపే లోకంమరలు గొలిపే ప్రతాపం
యాత్ర చేయు నాపై
విడువక నన్ను వెంటాడి
మరణకరమైన పాపము నన్ను
వెంటాడి ఎడ్వ చూచుచుండె
చరణం 2 :
పాప జీవితం విడిచిపాత జీవితం మరచి
పాప క్రియలు త్యజించి
పాపమునకు మృతుడవై
జీవించెదను నిత్యము నీలో
జీవప్రదాత యేసయ్య
