Showing posts with label Repentance songs. Show all posts
Showing posts with label Repentance songs. Show all posts

Wednesday, 18 April 2018

నిన్ను చూడాలి - Ninnu Chudali lyrics

నిన్ను చూడాలి 

పల్లవి :

నిన్ను చూడాలి... నిన్నే చూడాలి
నీ స్వరం వినాలి... నీతో గడపాలి
యేసయ్య...యేసయ్య నా మంచి యేసయ్య

||ఆశయ్య నాకు ఆశయ్య
నీతోనే ఉండాలనే చిన్ని ఆశయ్య
ఆశయ్య నాకు ఆశయ్య
నీతోనే గడపాలనే చిన్ని ఆశయ్య ||


చరణం 1  :

దినమెల్ల నేను నీలో ఉండాలి

బ్రతుకంతా నీవు నాతో ఉండాలిదినమెల్ల నేను నీలో ఉండాలి
బ్రతుకంతా నీవు నాతో ఉండాలి
నీవు నాకు తోడైతే... 
ఈ లోకములోనిదేది అక్కరలేదయ్య

||యేసయ్య...యేసయ్య నా మంచి యేసయ్య ||

చరణం 2  :

నీ ఆత్మలో నేను వర్ధిల్లాలి
దినదినము నీ కృపకై  ఎదురుచూడాలి
నీ నడిపింపుంటే ...నీ స్వరం వింటుంటే

ఈ లోకములోనిదేది అక్కరలేదయ్య 

||యేసయ్య...యేసయ్య నా మంచి యేసయ్య ||

NEEDED THE SONG TRACK???

Comment below if needed...based on the 

need it'll be uploaded...



Share:

Sunday, 25 February 2018

దైవమే నీ చేయి విడిచిన - Daivame nee Cheyi Vidachina lyrics


దైవమే నీ చేయి విడిచిన 

పల్లవి :

దైవమే నీ చేయి విడిచిన

నీ విభుడే నిను మరచెనా

ఈ పాప లోకం నిను విడిచేనా

అన్యాయముగా బలియైనావా

 

చరణం 1  :

నీతికి నిలిచిన నీ నామమున

దుష్టత్వముతో నిందలు వేసేనా

కరుణను చూపిన నీ మోముపైన

క్రూరత్వముతో  ఉమ్మివేసెనా

ముళ్ళకిరీటము  గ్రుచ్చెనా

హేళన చేసి హిoసించితిరా

 

చరణం 2  :

దైవ కుమారుని దేహము చీలగా

రుధిరము ధారలై ప్రవహించెనా

అయ్యో దేవా దాహపడితివా

నీ దాహమునే తీర్చలేదా

పగలే రాత్రిగా మారేనా       

నీ ప్రాణమును కొనిపోయెనా


Share:

Wednesday, 7 February 2018

నిన్ను విడచిన - Ninnu Vidachina

నిన్ను  విడచిన 

పల్లవి :

నిన్ను  విడచిన నన్ను ఎడబాయలేదే
నిన్ను మరచిన నన్ను  మరువనంటివి
నా అండ నీవై ఉండి  భయములన్ని తీసితివే
నన్ను నడిపించితి
నీవు తోడుగ ఉన్నావు  నా ఆశ్రయమైనావు

చరణం 1  :

నా వ్యాధి బాధలో నా మరణ శయ్యలో
నా దీన స్థితిగతిలో నే కృంగిన వేళలో
కన్నీరు తుడిచావు  కలతలన్ని తీర్చావు
నన్ను కరుణించావు  నన్ను బ్రతికించావు

చరణం 2  :

కన్నుమిన్ను  కానక  గర్వాన  పోరలితి
కాదంటి తండ్రి నిన్ను నీ ప్రేమను
నీకు దూరమయ్యాను వ్యధలపాలయ్యను
దిక్కులేక నిన్ను వెదకి నీ దరిని చేరాను

Share: