Showing posts with label la. Show all posts
Showing posts with label la. Show all posts

Wednesday, 27 May 2020

లెమ్ము తేజరిల్లుము - Lemmu Tejarillumu


లెమ్ము తేజరిల్లుము అని

లెమ్ము తేజరిల్లుము అని

నను ఉత్తేజ పరచిన నా యేసయ్య -2

నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు

రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని

నిను వేనోళ్ళ ప్రకటించెద -2

 

ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక

నీతో నడుచుటే నా భాగ్యము -2

శాశ్వత ప్రేమతో నను ప్రేమించి

నీ కృప చూపితివి -2

ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ…

ఇదియే నా భాగ్యమూ           

||లెమ్ము||

 

శ్రమలలో నేను ఇంతవరకును

నీతో నిలుచుటే నా ధన్యత -2

జీవకిరీటము నే పొందుటకే

నను చేరదీసితివి -2

ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత….

ఇదియే నా ధన్యత           

||లెమ్ము||

 

తేజోవాసుల స్వాస్థ్యము నేను

అనుభవించుటే నా దర్శనము -2

తేజోమయమైన షాలోము నగరులో

నిను చూసి తరింతునే -2

ఇదియే దర్శనము… ఇదియే దర్శనము…

ఇదియే నా దర్శనము         

||లెమ్ము||


Share:

Wednesday, 7 February 2018

లోకపాలక యేసునాధ - Lokapalaka Yesu Naadha lyrics

లోకపాలక యేసునాధ 

పల్లవి :

లోకపాలక యేసునాధ
సతతము నిన్నే ధ్యానింతును
ధన్య ధన్యమౌ నీదు నామం
నిన్నే నమ్మిన జీవితము
లోకపాపం తీసివేయ పాపి కొరకై జన్మించెను
లోకపాపం తీసివేయ పాపి కొరకై అరుదెంచెను

చరణం 1  :

ఇరులు గొలిపే లోకం
మరలు గొలిపే ప్రతాపం
యాత్ర చేయు నాపై
విడువక నన్ను వెంటాడి
మరణకరమైన పాపము నన్ను
వెంటాడి ఎడ్వ చూచుచుండె

చరణం 2  :

పాప జీవితం విడిచి
పాత జీవితం మరచి
పాప  క్రియలు త్యజించి
పాపమునకు మృతుడవై
జీవించెదను నిత్యము నీలో
జీవప్రదాత యేసయ్య




Share: