Showing posts with label sa. Show all posts
Showing posts with label sa. Show all posts

Friday, 5 June 2020

సర్వాంగ సుందరా - Sarvanga Sundara


సర్వాంగ సుందరా

సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2

నా ప్రార్ధన ఆలకించు వాడా – నా కన్నీరు తుడుచు వాడా
నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా
                                                       

||సర్వాంగ||

నా శాపములు బాపి నావా – నా ఆశ్రయ పురమైతివా
నా నిందలన్నిటిలో యెహోషపాతువై
నాకు న్యాయము తీర్చితివా
                                               

||సర్వాంగ||

నా అక్కరలు తీర్చి నావా – నీ రెక్కల నీడకు చేర్చి నావా
నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై
నా జయ ధ్వజమైతివా
                                                         

||సర్వాంగ||

 

Share:

Wednesday, 20 May 2020

Friday, 2 March 2018

సంగీత నాదముతో - Sangeetha Naadamutho lyrics

సంగీత నాదముతో     

పల్లవి :

సంగీత నాదముతో  స్తోత్ర సంకీర్తనతో
నీ ప్రేమ గీతం పాడెద
నీ గొప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చినా యేసయా

ఈ నీ రుణం తీర్చుట ఎటులయా 

చరణం 1  :

నా కఠిన హృదయమున  కారుణ్యమును నింపి
కలువలు  పూయించిన కృపను కొనియాడెద
పాపములు క్షమియించి నను మార్చినా

దోషములు భరియించి దరి చేర్చిన 


చరణం 2  :

నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి
విడువక నడిపించిన విధమును వివరించెద
క్షేమమును కలిగించి నను లేపినా
దీవెనలు కురిపించి కృప చూపిన 

చరణం 3  :

నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద
వాక్యముతో దర్శించి బలపరచినా
సత్యముతో సంధించి స్థిరపరచిన   



Share:

Tuesday, 13 February 2018

సిలువలో నలిగెను - Siluvalo Naligenu lyrics

సిలువలో నలిగెను  

పల్లవి :

సిలువలో నలిగెను సిలువలో కరిగెను
యేసు దివ్యదేహం
కలువరిగిరిలో కరుణను నింపెను
యేసు సిలువ యాగం
కలువరిలో కాలువలై
పొంగిపోరిలే కరుణాత్ముని రుధిరం

చరణం 1  :

పాపికి శరణం పాపపు హరణం
ప్రభుని రుధిరం యాగపు ఫలితం
సిలువధారి భరియించిన భారం
కలువరిలో ప్రభవించిన కధనం ...ప్రేమ ప్రభావం

చరణం 2  :

ప్రవచనసారం ప్రభునియాగం
పావన రుధిరం ప్రోక్షణరక్తం
సిలువధారి భరియించిన భారం
కలువరిలో ప్రభవించిన కధనం ...ప్రేమ ప్రభావం

చరణం 2  :

దేవుని ప్రేమయే సిలువ కార్యం
దేవునికిలల మార్గదర్శం
సిలువధారి భరియించిన భారం
కలువరిలో ప్రభవించిన కధనం ...ప్రేమ ప్రభావం


Share:

Monday, 22 May 2017

సుధా మధుర కిరణాల అరుణోదయం - Sudhamadhura kiranala Arunodayam

సుధా మధుర కిరణాల అరుణోదయం

 పల్లవి :-

సుధా మధుర కిరణాల అరుణోదయం

కరుణామయుని శరణం కరుణోదయం

తెర మరుగు హృదయాలు వెలుగైనవి

మరణాల చెరసాల మరుగైనది   

         ||సుధా||

చరణం 1 :-

దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలలో మిగిలాడని

నవలోక గమనాలు తెరిచాడని – పరలోక భవనాలు పిలిచాయని

ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది

పాడే పాటల పశువులశాలాలు ఊయల చేసింది

ఆ జన్మమే – ఒక మర్మమై – ఆ బంధమే – అనుబంధమై

||సుధా||

చరణం 2 :-

లోకాలలో పాప శోకాలలో – ఏకాకులై  బ్రతుకు అవివేకులా

క్షమ హృదయ సహనాలు సమపాళ్ళుగా – ప్రేమానురాగాలే  స్థిరాస్తిగా 

నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడాయేసు

నిత్య సుఖాలకు జీవజలాలకు  పెన్నిధి ఆ ప్రభువు 

నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ             

||సుధా||

Share: