పల్లవి :
ఈ దినం క్రీస్తు
జన్మదినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం
ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో
చరణం 1 :
దేవ దూతలు పలికిన
ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం
చరణం 2 :
పాప
దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము
0 comments:
Post a Comment