Showing posts with label ma. Show all posts
Showing posts with label ma. Show all posts

Sunday, 5 July 2020

మిత్రమా నా మిత్రమా – Mitrama naa Mitrama


మిత్రమా నా మిత్రమా – Mitrama naa Mitrama 

నీతో స్నేహం నాకు ప్రాణం
నాతో బంధం అది నీ త్యాగం
మిత్రమా నా మిత్రమా
చిత్రము ఇది చిత్రము

మిత్రమా నా మిత్రమా
చిత్రమా ఇది నీ చిత్తమా
మిత్రమా నా యేసయ్యా
చిత్రమే ఎంతో చిత్రమే

స్నేహం నీ స్నేహం
ప్రాణం నాకు ప్రాణం
నీ స్నేహం నాకు ప్రాణం
ప్రాణం నీ స్నేహం

నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా
నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా

||మిత్రమా||

మట్టిని మనిషిగ మలచినావు
మనిషిని మమతతో నింపినావు
మమతకు మంచిని నేర్పినావు
మంచికి మనసును ఇచ్చినావు
మట్టిని మనిషిగ మలచినావు ఎందుకో
మనిషిని మమతతో నింపినావు ఏమిటో
మమతకు మంచిని నేర్పినావు ఎందుకో
మనసుకు మనసును కలిపినావు
ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ
ముత్యాల బాటల్లో నడిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ

||మిత్రమా||

కంటి నీరు తుడిచినావు
కంటికి రెప్పై నిలిచినావు
వింతగ నన్ను వలచినావు
తండ్రివై నన్ను పిలిచినావు
కంటి నీరు తుడిచినావు ఎందుకో
కంటికి రెప్పై నిలిచినావు ఏమిటో
వింతగ నన్ను వలచినావు ఏలనో
తండ్రివై నన్ను పిలిచినావు
రతనాల రాశులలో నిలిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ
రతనాల రాశులలో నిలిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ

||మిత్రమా||

స్నేహం నీ స్నేహం
ప్రాణం నాకు ప్రాణం
నీ స్నేహం నాకు ప్రాణం
ప్రాణం నీ స్నేహం
నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా
నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా

||మిత్రమా||

Mitrama naa Mitrama song lyrics

Share:

Thursday, 4 June 2020

మహాఘనుడవు మహోన్నతుడవు - Maha Ghanudavu Mahonnathudavu


మహాఘనుడవు మహోన్నతుడవు

మహాఘనుడవు మహోన్నతుడవు

పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు -2

కృపా సత్య సంపూర్ణమై

మా మధ్యలో నివసించుట న్యాయమా

నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా -2

 

వినయముగల వారిని

తగిన సమయములో హెచ్చించువాడవని -2

నీవు వాడు పాత్రనై నేనుండుటకై

నిలిచియుందును పవిత్రతతో -2

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా -2       

||మహా||

దీన మనస్సు గలవారికే

సమృద్ధిగా కృపను దయచేయువాడవని -2

నీ సముఖములో సజీవ సాక్షినై

కాపాడుకొందును మెళకువతో -2

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా -2      

||మహా||

శోధింపబడు వారికి

మార్గము చూపించి తప్పించువాడవని -2

నా సిలువ మోయుచు నీ సిలువ నీడను

విశ్రమింతును అంతము వరకు -2

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా -2      

||మహా||

Share:

Friday, 29 May 2020

మహోన్నతుడా - Mahonnathuda


మహోన్నతుడా

మహోన్నతుడా

నీ కృపలో నేను నివసించుట

నా జీవిత ధన్యతై యున్నది

మహోన్నతుడా

నీ కృపలో నేను నివసించుట -2          

||మహోన్నతుడా||

మోడుబారిన జీవితాలను

చిగురింప జేయగలవు నీవు -2

మారా అనుభవం మధురముగా

మార్చగలవు నీవు -2            

||మహోన్నతుడా||

ఆకు వాడక ఆత్మ ఫలములు

ఆనందముతో ఫలియించినా -2

జీవ జలముల ఊట అయిన

నీ ఓరన నను నాటితివా -2     

||మహోన్నతుడా||

వాడబారని స్వాస్థ్యము నాకై

పరమందు దాచి యుంచితివా -2

వాగ్ధాన ఫలము అనుభవింప

నీ కృపలో నన్ను పిలచితివా -2 

||మహోన్నతుడా||

Share:

Wednesday, 20 May 2020

Saturday, 2 June 2018

మంచే లేని నా పైనా ఏంతో ప్రేమ చూపావు - Manche leni naa paina entha Prema

మంచే లేని నా పైనా ఏంతో ప్రేమ చూపావు

పల్లవి :

మంచే లేని నా పైనా ఏంతో ప్రేమ చూపావు 2
ఆది ఆంతమయిన వాడవు మానవుని రూపమెత్తావు 2
పరలోకమును విడిచి దిగి వచ్చినావు భువికి 2
ఎంతగా స్తుతులు పాడిన యేసు నీ ఋణము తీరునా 2

చరణం 1  :

లోకాలన్నీ ఏలే రారాజువైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు
నీ దెంత దీన మనసు నా కెంత ఘనత యేసు  

చరణం 2  :

చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసి నీవు
వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు
నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం
Share:
Categories

Sunday, 31 December 2017

మరచితినేమో మన్నించు దేవా - Marchitinemo mannicnchu deva


మరచితినేమో మన్నించు దేవా
పల్లవి :-
మరచితినేమో మన్నించు దేవా
ఒంటరినైతి నీ ప్రేమ లేక
చరణం 1:-
మా జన్మ పాపం వెంటాడుతున్న వేళ
సాతాను శోధనలో నలిగిపోతిని నేను
రోదనలే వేదనలై నీ చెంత చేరు వేళ
పాపాల చెర నుంచి రక్షించవా దేవా 
చరణం 2:-
మోషేని మన్నించి మన్నాను కురిపించి
ఆ ప్రజల గుండెల్లో దీపాన్ని వెలిగించి
లోకాశ లోయల్లో జారిపోతున్న వేళ
నీ చేతితో పట్టి నడిపించవా దేవా
చరణం 3 :-
జీవాత్మ వెలుగులో నడిపించు ఈ జీవితం
పరమాత్మా తేజమై  పలికించు ఈ వాక్యం
ప్రభు యేసు నామం మధురాతి మధురం
లోకాన్ని నడిపించే జీవామృత వేదం 

రచన :- శ్రీ.కళాప్రపూర్ణ జాలాది గారు


Share: