సిలువలో నలిగెను
పల్లవి :
సిలువలో నలిగెను సిలువలో కరిగెనుయేసు దివ్యదేహం
కలువరిగిరిలో కరుణను నింపెను
యేసు సిలువ యాగం
కలువరిలో కాలువలై
పొంగిపోరిలే కరుణాత్ముని రుధిరం
చరణం 1 :
పాపికి శరణం పాపపు హరణంప్రభుని రుధిరం యాగపు ఫలితం
సిలువధారి భరియించిన భారం
కలువరిలో ప్రభవించిన కధనం ...ప్రేమ ప్రభావం
చరణం 2 :
ప్రవచనసారం ప్రభునియాగంపావన రుధిరం ప్రోక్షణరక్తం
సిలువధారి భరియించిన భారం
కలువరిలో ప్రభవించిన కధనం ...ప్రేమ ప్రభావం
చరణం 2 :
దేవుని ప్రేమయే సిలువ కార్యందేవునికిలల మార్గదర్శం
సిలువధారి భరియించిన భారం
కలువరిలో ప్రభవించిన కధనం ...ప్రేమ ప్రభావం
0 comments:
Post a Comment