పల్లవి :
ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా
నీ మేలులన్
చరణం 1 :
మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును
నీ నామమున్
చరణం 2 :
నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు
నీ కృపకు నన్ను ఆహ్వానించినావు
నీ సన్నిధి
నాకు తోడునిచ్చినావు
0 comments:
Post a Comment