బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా -2
మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా -2
నా యేసయ్యా.. నా యేసయ్య......
నా యేసయ్యా.. నా యేసయ్యా......
||బంగారం||
పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా -2
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా -2
||నా యేసయ్యా||
రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్యమొందాడయ్యా -2
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా -2
||నా యేసయ్యా||
0 comments:
Post a Comment