Friday, 12 June 2020

కమ్మని బహుకమ్మని - Kammani Bahu Kammani


కమ్మని బహుకమ్మని

కమ్మని బహుకమ్మని చల్లని అతి చల్లని

తెల్లని తేట తెల్లని యేసు నీ ప్రేమామృతం -2

జుంటె తేనె కన్న మధురం సర్వ జనులకు సుకృతం -2

యేసు నీ ప్రేమామృతం -2       

||కమ్మని||

ఆశ చూపెను ఈ లోకం మలినమాయెను నా జీవితం

యేసూ నీదు ప్రేమ దయ చూపెను ఈ దీనురాలి పైన -2

వెలిగెను నాలో నీ ఆత్మ దీపము -2

కడిగిన ముత్యముగా అయ్యాను నేను -2     

 ||కమ్మని||

నా కురులతో పరిమళమ్ములతో చేసెద నీదు పాద సేవ

నా గుండె గుడిలో కొలువైయున్న నీకు చేసెద నేను మధుర సేవ -2

ఆరాధింతును నిన్ను అనుదినము -2

జీవింతును నీకై అనుక్షణము -2    

   ||కమ్మని||

Kammani Bahu Kammani lyrics
Share:
Categories

0 comments:

Post a Comment