Friday, 12 June 2020

తలవంచకు నేస్తమా - Talavanchaku Nesthama

తలవంచకు నేస్తమా

తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా

తలవంచకు ఎప్పుడు తలవంచకు ఎన్నడూ

స్వార్ధపుటంచున ఊగిసలాడే లొకంలో కుడి ఎడమలకు బేధం తెలియని లొకంలో

కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో

నీవు కావాలి ఓ మాదిరి - నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ

నీవు మండాలి ఓ జ్వాలగా - నీవు చేరాలి ఓ గమ్యము...

తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా

తలవంచకు ఎప్పుడు తలవంచకు ఎన్నడూ

చీకటిని వెనుకకు త్రోసి సాగిపోముందుకే

క్రీస్తు బాటలో పయనిస్తే ఎదురేమున్నది

రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే

క్రీస్తును చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే

రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే

క్రీస్తును చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే

నీవు కావాలి ఓ మాదిరి - నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ

నీవు మండాలి ఓ జ్వాలగా - నీవు చేరాలి ఓ గమ్యము...

తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా

తలవంచకు ఎప్పుడు తలవంచకు ఎన్నడూ

పెకలించు కొండలను - విశ్వాస బాటలొ

గెలవాలి యుద్ధ రంగంలో - దైవిక బలముతో

యేసుని కృప నీలోనే ఉంది - సాధించు ప్రగతిని

మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో

యేసుని కృప నీలోనే ఉంది - సాధించు ప్రగతిని

మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో

నీవు కావాలి ఓ మాదిరి - నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ

నీవు మండాలి ఓ జ్వాలగా - నీవు చేరాలి ఓ గమ్యము...

తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా

తలవంచకు ఎప్పుడు తలవంచకు ఎన్నడూ

స్వార్ధపుటంచున ఊగిసలాడే లొకంలో కుడి ఎడమలకు బేధం తెలియని లొకంలో

కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో

నీవు కావాలి ఓ మాదిరి - నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ

నీవు మండాలి ఓ జ్వాలగా - నీవు చేరాలి ఓ గమ్యము...

నీవు కావాలి ఓ మాదిరి - నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ

నీవు మండాలి ఓ జ్వాలగా - నీవు చేరాలి ఓ గమ్యము...

Share:

Related Posts:

0 comments:

Post a Comment