Showing posts with label John Wesly. Show all posts
Showing posts with label John Wesly. Show all posts

Friday, 12 June 2020

జీవితంలో నేర్చుకున్నాను - Jeevithamlo Nechukunnanu

జీవితంలో నేర్చుకున్నాను

జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం

యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం -2

సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా

ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా        

 ||జీవితంలో||

ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం

నిరతము యేసునే స్తుతియించాలని

కూడగట్టుకున్నాను శక్తన్తయు

నిరతము యేసునే చాటించాలని

ఆ యేసే నిత్య రాజ్యము

ఆ యేసే గొప్ప సత్యము -2     

    ||జీవితంలో||

నిర్మించుకున్నాను నా జీవితం

సతతం యేసులో జీవించాలని

పయనిస్తు ఉన్నాను నా బ్రతుకులో

యేసయ్య చిత్తము జరిగించాలని

ఆ యేసే సత్య మార్గము

ఆ యేసే నిత్య జీవము -2        

 ||జీవితంలో||

Share:

తలవంచకు నేస్తమా - Talavanchaku Nesthama

తలవంచకు నేస్తమా

తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా

తలవంచకు ఎప్పుడు – తలవంచకు ఎన్నడూ

స్వార్ధపుటంచున ఊగిసలాడే లొకంలో – కుడి ఎడమలకు బేధం తెలియని లొకంలో

కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో – ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో

నీవు కావాలి ఓ మాదిరి - నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ

నీవు మండాలి ఓ జ్వాలగా - నీవు చేరాలి ఓ గమ్యము...

తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా

తలవంచకు ఎప్పుడు – తలవంచకు ఎన్నడూ

చీకటిని వెనుకకు త్రోసి – సాగిపోముందుకే

క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది

రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే

క్రీస్తును చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే

రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే

క్రీస్తును చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే

నీవు కావాలి ఓ మాదిరి - నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ

నీవు మండాలి ఓ జ్వాలగా - నీవు చేరాలి ఓ గమ్యము...

తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా

తలవంచకు ఎప్పుడు – తలవంచకు ఎన్నడూ

పెకలించు కొండలను - విశ్వాస బాటలొ

గెలవాలి యుద్ధ రంగంలో - దైవిక బలముతో

యేసుని కృప నీలోనే ఉంది - సాధించు ప్రగతిని

మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో

యేసుని కృప నీలోనే ఉంది - సాధించు ప్రగతిని

మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో

నీవు కావాలి ఓ మాదిరి - నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ

నీవు మండాలి ఓ జ్వాలగా - నీవు చేరాలి ఓ గమ్యము...

తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా

తలవంచకు ఎప్పుడు – తలవంచకు ఎన్నడూ

స్వార్ధపుటంచున ఊగిసలాడే లొకంలో – కుడి ఎడమలకు బేధం తెలియని లొకంలో

కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో – ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో

నీవు కావాలి ఓ మాదిరి - నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ

నీవు మండాలి ఓ జ్వాలగా - నీవు చేరాలి ఓ గమ్యము...

నీవు కావాలి ఓ మాదిరి - నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ

నీవు మండాలి ఓ జ్వాలగా - నీవు చేరాలి ఓ గమ్యము...

Share:

Thursday, 4 June 2020

గమ్యం చేరాలని - Gamyam Cheralani

గమ్యం చేరాలని

గమ్యం చేరాలని నీతో ఉండాలని

పగలూ రేయి పరవశించాలని

ఈ నింగి నేలా కనుమరుగైనా

శాశ్వత జీవం పొందాలని

సాగిపోతున్నాను నిన్ను చూడాలని

నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని -2      

||గమ్యం చేరాలని||

భువి అంతా తిరిగి జగమంతా నడచి

నీ జ్ఞానముకు స్పందించాలని

నాకున్నవన్ని సమస్తం వెచ్చించి

నీ ప్రేమ ఎంతో కొలవాలని

అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో

అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో        

||సాగిపోతున్నాను||

అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా

శిరమును వంచి సహించాలని

వేదన బాధలు గుండెను పిండినా

నీదు సిలువనే మోయాలని

నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి

నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని      

||సాగిపోతున్నాను||

Share:

దుర్దినములు రాకముందే - Durdinamulu Rakamunde

దుర్దినములు రాకముందే

దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే

అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే -2

స్మరియించు రక్షకుని అనుకూల సమయమున

చేర్చుకో యేసుని ఆలస్యం చేయక -2      

||దుర్దినములు||

సాగిపోయిన నీడవంటి జీవితం

అల్పమైనది నీటి బుడగ వంటిది -2

తెరచి ఉంది తీర్పు ద్వారం

మార్పులేని వారికోసం -2

పాతాళ వేదనలు తప్పించుకొనలేవు

ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు -2      

||దుర్దినములు||

రత్నరాసులేవి నీతో కూడ రావు

మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి -2

యేసు క్రీస్తు ప్రభువు నందే

ఉంది నీకు రక్షణ -2

తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని

విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని -2      

||దుర్దినములు||

Share: