Showing posts with label ga. Show all posts
Showing posts with label ga. Show all posts

Sunday, 5 July 2020

గడచిన కాలము కృపలో మమ్ము – Gadachina kalam Krupalo mammu


గడచిన కాలము కృపలో మమ్ము 

గడచిన కాలము కృపలో మమ్ము

దాచిన దేవా నీకే స్తోత్రము

పగలూ రేయి కనుపాపవలె

కాచిన దేవా నీకే స్తోత్రము (2)

మము దాచిన దేవా నీకే స్తోత్రము

కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)       

||గడచిన||

కలత చెందిన కష్టకాలమున

కన్న తండ్రివై నను ఆదరించిన

కలుషము నాలో కానవచ్చినా

కాదనక నను కరుణించిన (2)

కరుణించిన దేవా నీకే స్తోత్రము

కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)      

||గడచిన||

 

లోపములెన్నో దాగి ఉన్నను

ధాతృత్వముతో నను నడిపించినా

అవిధేయతలే ఆవరించినా

దీవెనలెన్నో దయచేసిన (2)

దీవించిన దేవా నీకే స్తోత్రము

దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2)       

||గడచిన||

 

రచన – రెవ. జాన్ వెస్లీ

 

Gadachina kalam Krupalo mammu lyrics


Share:

Saturday, 4 July 2020

గూడు లేని గువ్వల దారి తప్పితి - Goodu Leni Guvvalaa




గూడు లేని గువ్వల దారి తప్పితి   

గూడు లేని గువ్వలా దారి తప్పితి

గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)

నీ గుండెలో దాచుమా

నీ గూటికే చేర్చుమా (2)

నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా

నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా 

||గూడు|| 

1.       గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం

నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2)

నువ్వంటే ఇష్టం యేసయ్యా

నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) 

||నా ప్రాణమా||

2.       చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం

నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2)

నేనంటే నీకెంతో ఇష్టమయ్యా

నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) 

||నా ప్రాణమా||

 

రచన – గుంటూరు రాజా

 

Goodu Leni Guvvalaa  LYRICS
Share:

Thursday, 4 June 2020

గమ్యం చేరాలని - Gamyam Cheralani


గమ్యం చేరాలని

గమ్యం చేరాలని నీతో ఉండాలని

పగలూ రేయి పరవశించాలని

ఈ నింగి నేలా కనుమరుగైనా

శాశ్వత జీవం పొందాలని

సాగిపోతున్నాను నిన్ను చూడాలని

నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని -2      

||గమ్యం చేరాలని||

భువి అంతా తిరిగి జగమంతా నడచి

నీ జ్ఞానముకు స్పందించాలని

నాకున్నవన్ని సమస్తం వెచ్చించి

నీ ప్రేమ ఎంతో కొలవాలని

అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో

అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో        

||సాగిపోతున్నాను||

అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా

శిరమును వంచి సహించాలని

వేదన బాధలు గుండెను పిండినా

నీదు సిలువనే మోయాలని

నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి

నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని      

||సాగిపోతున్నాను||

Share:

Wednesday, 20 May 2020