దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం ఎలా?
మనము తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవునికి ప్రధమ స్థానం
ఇవ్వాలి. దీని ద్వారా మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోవచ్చు. ఇది మన గమ్యాన్ని
నిర్దేశిస్తుంది. ప్రతి విషయాన్నీ ప్రభువునకు ప్రార్ధానాపూర్వకంగా మొరపెట్టాలి.
రోజులో మొదటి సమయాన్ని ప్రభువునకు ఇవ్వాలి. వేకువనే లేచిన వెంటనే ఏ విషయాల పైనా మన మనస్సు నింపుకుంటామో అవే ఆలోచనలతో దినమంతా గడుపుతాము. కాబట్టి దేవుని వాక్యంతో మనస్సు నింపుకోవాలి కారణం మనలను సజీవుల లేక్కలో ఉంచాడు కాబట్టి మనము ప్రార్ధన చేయాలి.
వారంలో మొదటి రోజును ప్రభువునకు ఇవ్వాలి. మనం వ్యక్తిగతంగా, సమూహంగా సమాజంగా, సంఘపరంగా దేవుని మహిమ పర్చాలి దీని ద్వారా ఆయన దీవెనలు పొందుకుంటాము.
మన సంపాదనలో కొంత భాగం దేవుని సేవకు ఇవ్వాలి. దీని ద్వారా మన కృతజ్ఞతను దేవునికి తెలియజేస్తాము
మన సంభాషణలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దీని ద్వారా
ఐశ్వర్యములు ధనఘనతలు ఆయన రాజ్యాన్ని నీతిని చూస్తాము.
ఈ
విధంగా దేవుని మహిమపరచడానికి మనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోవాలి. ఇవన్నీ మనం చేస్తే మన అక్కరలన్నీ ఆయన తీరుస్తాడు. ఆయన రాజ్యానికి మనం
చేరువవుతాము.
0 comments:
Post a Comment