నయోమి కోడలికి ఇచ్చిన చెడ్డ సలహా
ఇశ్రాయేలు దేశంలోని కరువును తప్పించుకొనేందుకు దాదాపు పదేళ్ల క్రితం నయోమి ఎలీమెలెకు వారి ఇద్దరు కుమారులు తాత్కాలికంగా నివశించేందుకే మోయాబు దేశానికి వెళ్ళారు.
కొద్దికాలానికే నయోమి భర్త ఎలీమెలెకు మరణించాడు. వారి ఇద్దరు కమారులైన మహ్లోను, కిల్యోనులు ఓర్పా, రూతులను వివాహం చేసుకున్నారు.
అప్పటికే విధవరాలుగా ఉన్న తమ తల్లితో పాటు తమ ఇద్దరు భార్యలను విధవరాండ్రలను చేస్తూ వారి కుమారులు కూడా మరణించారు(మహ్లోను, కిల్యోను).
నయోమి తన స్వగ్రామమైన యూదా దేశంలోని బెత్లెహేములో కరువు పోయిందని, పంటలు బాగా వండుతున్నాయని, తాగేందుకు నీరు పుష్కలంగా ఉందని గ్రహించిన నయోమి బెత్లేహేముకు తిరిగిరావాలి అని నిర్ణయించుకుని ఆమెతో పాటు ఆమె ఇద్దరు కోడళైన ఓర్పా, రూతులు పయనమయ్యారు.
నయోమి నిజంగా వారిని ప్రేమించి,
తమ భవిష్యత్ నంతోషంగా గడపాలని కోరుకుని తనతో బెత్లేహేముకు
తిరిగి రావటానికి అభ్యంతర వరున్తూ తమ దేశానికి తిరిగి
వెళ్ళమనీ, తిరిగి వివాహాలు చేసుకోమనీ సంతోషంగా బ్రతకమని సలహా ఇచ్చింది. అత్తయైన నయోమి పదేళ్ళపాటు
విగ్రహారాధికులైన మోయాబీయులు మధ్య జీవించడం అనేది ఆమె ఆత్మీయ
వతనస్థితికి మరల్చింది అని మనం గ్రహించవలసిన విషయం.
అటుతర్వాత నయోమి తన ఇద్దరు కోడళ్ళు అయిన,
రూతులు ఒకరినొకరు కౌగలించుకుని బిగ్గరగా ఏడ్చిన తరువాత ఓర్పా
తన అత్తను ముద్దు పెట్టుకొని అత్త ఇచ్చి న నలహా ప్రకారం మోయాబు
దేశానికి తిరిగి వెళ్ళిపోయింది.
ఆ ప్రకారమే రూతు
వైపు తిరిగి ఇదిగో “నీ తోడికోడలు తన జనుల యొద్దకును,
దేవుని యొద్దకును తిరిగి వెళ్ళింది కదా నీవు కూడా ఆమె వెంబడి
వెళ్ళుమని” నలహా ఇచ్చింది. ఈ నలహా వినేందుకు, చూచేందుకు ఆమె మీద ప్రేమతో ఇచ్చిన మంచి సలహా గానే మనకు
అనిపిస్తుంది. నిశితంగా లోతుగా వరిశీలన
చేస్తే
ఇది ఒక చెడ్డ
సలహా తప్ప మరొకటి కాదు.
తను ఎంచుకున్న మార్గము అంత సరియైనది కాకపోయినప్పటికీ ముందుకు
వెళ్ళేందుకే రూతు నిర్ణయించుకుంది.
0 comments:
Post a Comment