అంజూరపు చెట్టును శపించుట మత్తయి 21 :19
మార్కు 11:14
సాధారణంగా అంజూరపు చెట్టు ఆకులతో పాటు కాయలు రావడం. లేక
కొన్ని సార్లు ఆకులు పూర్తిగా రాకమునుపే కాయలు ఉండడం కద్దు. అంజూరపు చెట్టుకు ఆకులు, కాయలు వుండే సమయం
అప్పటికి రాకపోయినా ఒక చెట్టుకు నిండుగా ఆకులున్నాయంటే కాయలు కూడా వుండి తీరాలి. అది
ఏప్రిల్ నెల, సాధాణంగా ఆకులు, కాయలు జూన్ నాటికి గాని కనిపించవు. ఈ దారిన పోయేవారిని ఈ చెట్టు మోసం
చేస్తుంది. తనకు లేనిది ఉన్నట్టుగా
చెప్తుంది. నిశితంగా చూస్థే అది ఇజ్రాయేల్
జాతికి, జెరూసలేం నగరానికి దృష్టాంతంగా వుంది.
ఫలభరితమైన జీవితమేమీ లేకుండా, ఏంతో వుందని చెప్పుకుంటూ, కొంచెమే ఫలించే ఏ
వ్యక్తికైనా, సంఘానికైనా కూడా ఇది సూచనగా వుంది.
కాయలు లేకుండా గుబురుగా ఆకులుంటే లాభం ఏముంది? కొన్ని సార్లు బైబిల్లో
చెట్లు జాతులనూ, వ్యక్తులనూ సూచిస్తాయి. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు ఇజ్రాయేలుకు సూచనగా
వుందని రాసిలేదు గానీ ఇది అసాధ్యం ఏమీ కాదు.
ఇజ్రాయేలుకు కూడా పుష్కలంగా ఆకులున్నాయి గానీ కాయలు లేవు. లేదా కొద్దిగా మాత్రమె వున్నాయి.
ఈ చెట్టు ద్వారా యేసు శిష్యులకు ఇజ్రాయేల్ ఫై రాబోయే తీర్పు
గురించి కాదు. విస్వాసములో ఉండే బల, ప్రభావాల గురించి. నమ్మకం లేకుండా చేసే ప్రార్ధనలో శక్తి
ఉండకపోవచ్చు గాని, విశ్వాసముతో చేసిన ప్రార్ధన గొప్ప కార్యాలు సాధించగలదు.
లూకా :13:6-9
దేవుడు మనుష్యుల వ్యవహారాలను అదుపులో ఉంచుతూ, తన జ్ఞానం
చొప్పున తీర్పులు తీరుస్తూ ఉండడం గురించి ఈ చెట్టు సూచనగా వున్నది. మనుష్యులు చేస్తున్న వాటిని చెయ్యకుండా వదిలి
పెడుతున్న వాటిని దేవుడు ఎప్పుడూ గమనిస్తున్నాడనడంలో సందేహం లేదు.కొందరిని లోకం
నుండి తొలగిస్తూ మరి కొందరి విషయంలో మరి కొద్ది కాలం ఓపికతో ఎదురు
చూస్తున్నాడు. మంచి ఫలాలు లేని ఏ
జీవితమైనా ప్రమాదంలో ఉన్నట్టే.
ద్రాక్ష తోటలో పనిచేసే వ్యక్తి అంజూరపు చెట్టు గురించి యజమానుని బ్రతిమలాడడం
ద్వారా కనీసం మరి కొద్దికాలం దానిపైకి వచ్చే తీర్పును ఆలస్యం అయ్యేలా చేసాడు. ఆ సమయంలో కాయలు కాయడం మొదలు పెడితే ఆ తీర్పును
శాశ్వతంగా మళ్లించిన వాడవుతాడు.
కాబట్టి ఫలించమని దేవుడు ఈ భూమి మీద మనలను సృష్టిస్తే ఈ చెట్టులాగా
కాకుండా ఫలభరితంగా వుండాలని దేవుడు సూచిస్తున్నాడు.
0 comments:
Post a Comment