మనము
విశ్వాసముతో ప్రార్ధనచేయునప్పుడు అడిగినవి మనకు ఇయ్యబడును. కీర్తనలు ; 102:17, 22:24, 31:22, 69:33, 68:6
దేవుడు తన కుమారుని బాధలను
త్రోసిపుచ్చక విస్వాసుల పాపాలకు రావాల్సిన శిక్ష తానే వాటిని అంగీకరించి ఆ బాధ
నుండి ఆయన విముక్తుల్ని చేస్థాడు. దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకోవడం తాత్కాలికమే.
కాబట్టి దేవుని దగ్గర మనకు
వున్న భయాన్ని వీడి, కలత చెందకుండ దేవుని దగ్గర విశ్వాసముతో ఆయనకు మొరపెడితే మన
విజ్ఞాపనను ఆలకిస్తాడు.
దేవుడు అణుకువ, భక్తి గల వారి ప్రార్ధనలు వింటాడు. కాని పేదలు కదా
అని వారు దుర్మార్గులైనప్పటికి వారి ప్రార్ధనలు వింటాడనుకోకూడదు .
బంధింపబడినవారిని విడిపించి
వర్దిల్లచేయువాడు.
మత్తయి: 7:7-11,
మీరు చెడ్డవారైయుండియు
మీ పిల్లలకు మంచి ఈవులను నియ్య నెరిగియుండగా పరలోకమందున్న తండ్రి తన్ను
అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును
“చెడ్డవారు”-
తన స్వంత శిష్యులను యేసు అన్న మాట. ఇతరుల
కన్నా వారేమి చెడ్డ వారుకాదు, అనేకమంది కంటే మంచి వారు
కూడా. యేసు ఇక్కడ మనుష్యులందరిలోనూ తన శిష్యులలో వున్న చెడును చెప్తున్నారు.
తప్పుడు ఆలోచనలు, చెడ్డ కోరికలు,
పాపంతో కూడుకుకున్న
పనులు ఇవన్నీ చెడ్డ స్వభావానికిగుర్తులు. యేసు శిష్యులు ఆలోచనల్లోనూ , మాటల్లోనూ,
పనుల్లోనూ పాపంలేని వారు కాదు. ఆరంభంలోని
ఈ పండ్రెండుమంది శిష్యులకంటే అధికుఅమనీ, మంచివారమనీ ఎవరైనా అనుకుంటే వారు పెద్ద
పొరపాటు చేస్తున్నారు కారా.
కాబట్టి మనము పొరపాట్లు చేసినా
దేవుడు మనలను క్షమించి విశ్వాసముతో ప్రార్థించినప్పుడు మనము అడిగినవాటిని మనకు
తప్పక దయచేస్తాడు.
0 comments:
Post a Comment