Monday, 15 February 2021

ఆయన ప్రార్ధించెను

 

ఆయన ప్రార్ధించెను

మార్కు :1-35

యేసు తరచుగా ప్రార్ధించాడు.  కొన్నిసార్లు ఒంటరిగా వెళ్లి ప్రార్ధించాడు.  ఒక మనుష్యుడుగా ప్రత్యేకమైన దైవ కుమారుడుగా కూడా ప్రార్ధించాడు.అంటే ఆయన ప్రార్ధనలో మానవ స్వభావం, దైవ స్వభావం రెండూ ముఖ్య పాత్ర వహించాయి.

లూకా 22-32

యేసు విశ్వాసులందరి కోసమూ ప్రార్ధన చేసాడు. 1పేతురు 1-5 పెతురును ఉద్దేశించి నీవు మళ్ళి దేవుని వైపు తిరిగినప్పుడు అంటున్నాడు గాని తిరిగినట్లయితే అనడం లేదు.  పేతురు విషయంలో తాను చేస్తున్న ప్రార్ధన సఫలమవుతుందని ఆయనకు తెలుసు. మన విషయంలో కూడా ఆయన చేసిన ప్రార్ధన తప్పక సఫలం అవుతుంది.

లూకా 11 : 1

యేసు ప్రభువు తరచుగా ప్రార్ధించడం తెలుసుకొనిన శిష్యులు ప్రార్ధన గురించి తమకు తెలిసింది ఎంత తక్కువో శిష్యులు గ్రహించారని లుకా 11:1లో చెప్పిన విధంగా ఆయన ఒక చోట ప్రార్ధన చేసి చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పిన ప్రార్ధన మాకు దయచేయుమని అడిగెను మనం ప్రార్ధించడం నేర్చుకొంటే ఆధ్యాత్మికంగా అత్యంత ధన్యకరమైన, దీవెనకరమైన పనిని నేర్చుకోన్నట్లే .

 

Share:

0 comments:

Post a Comment