Wednesday, 17 February 2021

యేసయ్య మనస్సు

 

యేసయ్య మనస్సు

ఫిలిప్పి: 2: 5-8 

క్రీస్తు ఏసునకు ఇతరులపట్ల ప్రేమ , వినయం, తగ్గింపు స్వభావం ఉన్నట్లుగానే ఆయనకు వున్న మనస్తత్వమే విశ్వాసులకు వుండడం, ఆయన ఆలోచించినట్లుగానే ఆలోచించడం సాధ్యమే అని పరిశుద్దుడైనే పౌలు చెప్పారు.క్రీస్తు  విస్వాసుల హృదయాల్లో ఆయన యజమానిగా వుంటే వారికి ఉండవలసిన మనస్తతత్వాన్ని ఆయనే వారికి దయచేస్తాడు.ఈ విధంగా ఆయన విశ్వాసులకు దయచేసినప్పుడు విస్వాసుల మధ్య స్వార్ధం, గర్వం, అహంభావం, ఘర్షణలు నశించిపోతాయి. క్రీస్తునకు కలిగిన ఈ మనసును విశ్వాసులు తమ జీవితాల్లో పాటించాలని  యేసు పరలోక మహిమనూ, సౌభాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో విజయవంతమైన సేవ చేసాడు.విస్వాసులంతా దీనిని ఆదర్శంగా తీసికుని కపటమైన, నీచమైన స్వభావాని ధన, ఘనతలను విసర్జించడం నేర్చుకోవాలి .అణుకువ కలిగి దేవునికి ఇతరులకు సేవ చేయడంలో తమ జీవితాలను గడపాలి. “దేవుని స్వరూపి” క్రీస్తు దేవుని స్వభావం కలవాడు.  స్వభావంలోను లక్షణాల్లోనూ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు సమానమే. దైవత్వంలో వీరి స్థాయిల్లో తేడా వుంది. తండ్రికి అత్యున్నత స్థానం వుంది. కుమారుడైన క్రీస్తు తండ్రితో సమాన స్థాయిని ఎంచుకోనలేదుగాని  తండ్రి తండ్రిగా వుండాలని ఎంచాడు. కుమారుడుగా తాను తండ్రికి విధేయుడుగా ఉండేందుకు సిద్దపడడం ఆయనకు ఎప్పుడూ సంతోషమే.  “ఏమీ లేనివాడుగా” తండ్రితో పాటు తనకున్న మహిమనూ, తన పరలోక నివాసాన్ని, అందులోని తన ఆదిక్యతలన్నింటినీ యేసు పక్కన పెట్టాడు. నరులకు ఊపిరి పోసినవాడు మనుష్యుల ద్వారా అవమానానికి, సిద్దపడ్డాడు.

నరుని పోలికగా అంటే యేసులో నిజమైన మానవ స్వభావం వుంది. “ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి” అనగా ఆయన సామాన్యుడుగా కనుపించాడు. భూలోకానికి రాకముందు ఆయనకున్న దైవత్వం, మహిమ కంటికి కనుపించకుండా దాచబడింది, ఇది  సత్యం.ఆయనకున్న వినయం,  తగ్గింపు స్వభావం ఆయన మరణంలో కనుపించాయి. ఆయనపై చెయ్యని నేరం మోపి పలు రకాలుగా భాధలు పెట్టి చంపుతున్నా ఆయన నోరు తెరువలేదు, ఎదిరించలేదు. సిలువ మరణం అంటే అవమానకరమైనమరణం–ఉమ్మివేసి కొరడాలతో కొట్టి మేకులు గ్రుచ్చి చంపడం.  అంటే తండ్రి ఐన దేవునికి విధేయుడు అయ్యాడు.    

1పేతురు 4:1-2

మానవాళిని పాపం నుంచి విడుదల చేయడానికి క్రీస్తు బాధలు అనుభవించాడు.  విశ్వాసులుగా మనము కూడా ఆయనలాగా బాధలను, శ్రమలనుఎదుర్కొనేందుకుసిద్దపడాలి.ఆధ్యాత్మికంగా పాపానికి విరుద్దంగా మనము చేసే పోరాటం ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది.  ఆయనలాగే మనము కూడా పాప కార్యాలనుంచి విముక్తి పొందామని, మరణించామనే సత్యాన్ని గ్రహించాలి.  పాపం విషయంలో ఒకసారి మరణించిన తరువాత ఎలాంటి జోక్యం ఉండకూడదు.  మన కోర్కెలను మనము తీర్చుకొనే వారిలాగా కాకుండా ఆయన చిత్తానుసారంగా ఆయన సంకల్పాన్ని నేరవేర్చేవారిలాగా జీవించాలి.                  

 

 

 

 

 

 

 

 

 

 

Share:

0 comments:

Post a Comment