ప్రశ్నలు జవాబులు (లూకా సువార్త )
1.
లూకా ఇద్దరు వ్యక్తుల పుట్టుకను గూర్చి
వ్రాసాడు? వారు ఎవరు?
బాప్తిస్మికుడైన
యోహాను, యేసు.
2.
మరియ, ఎలిజబెతులు పాడిన గీతములు ఏ
అధ్యాయంలో వున్నాయి?
లూకా 1వ అధ్యాయంలో
వున్నాయి
3.
లూకా 1వ అధ్యాయంలో ఎవరి ప్రవచన గీతం
వున్నది?
జేకర్యా
4.
“అటోప్తోమాయ్” అనేది ఏ పదము?
గ్రీకు
5. అటోప్తోమాయ్” అనే పదానికి అర్ధం
ఏమిటి?
కన్నులారా
చూచినవారి సాక్ష్యం
5.
“అటో” అనగా?
తనంతట తానే అని అర్ధం.
6.
“అప్తోమాయ్”
అనగా ?
చూడడము
7.
“అటోప్తోమాయ్” అనేది ఏ భాష?
వైద్య పరిభాష
8.
వాక్య సేవకులు అనే మాట ఎవరు
ప్రయోగించారు?
లూకా
9.
“ఉపరేటాయ్” అనేది ఏ పదము?
గ్రీకు
10.
“ఉపరేటాయ్” అనే గ్రీకు పదానికి అనువాదాము?
వాక్యసేవకులైనవారు
11.
“ఉపరేటాయ్” అనగా భావము?
ఉపనావికుడు
అని భావము
12.
“ఉపరేటాయ్” అనగా ఎవరు?
ఆసుపత్రిలో వైద్యునితో కలిసి పనిచేసే సహాయకుడిని
13.
జేకర్యా, ఎలిజబెతులు ఎటువంటి వారు?
నీతిమంతులు
14.
యేసు అనే వైద్యుని క్రింద ఉపవైద్యులు,
సహాయకులు ఎవరు?
వాక్యసేవకులైనవారు
15.
యేసుకు ఉపవైద్యుడు ఎవరు?
లూకా
0 comments:
Post a Comment