పల్లవి :-
మరచితినేమో మన్నించు దేవా
ఒంటరినైతి నీ ప్రేమ లేక
చరణం 1:-
మా జన్మ పాపం వెంటాడుతున్న
వేళ
సాతాను శోధనలో నలిగిపోతిని
నేను
రోదనలే వేదనలై నీ చెంత చేరు
వేళ
పాపాల చెర నుంచి రక్షించవా
దేవా
చరణం 2:-
మోషేని మన్నించి మన్నాను
కురిపించి
ఆ ప్రజల గుండెల్లో దీపాన్ని
వెలిగించి
లోకాశ లోయల్లో జారిపోతున్న
వేళ
నీ చేతితో పట్టి నడిపించవా
దేవా
చరణం 3 :-
జీవాత్మ వెలుగులో నడిపించు ఈ
జీవితం
పరమాత్మా తేజమై పలికించు ఈ వాక్యం
ప్రభు యేసు నామం మధురాతి
మధురం
లోకాన్ని నడిపించే జీవామృత
వేదం
రచన :- శ్రీ.కళాప్రపూర్ణ జాలాది గారు
0 comments:
Post a Comment