శరణు శరణు దేవ
పల్లవి :
శరణు శరణు దేవ శరణు ఓ
దేవా
శరణుజొచ్చితి రమ్ము కరుణతో బ్రోవ
శరణు శరణు దేవ శరణు ఓ
దేవా
శరణుజొచ్చితి రమ్ము కరుణతో బ్రోవచరణం 1 :
పాపేచ్చలతో నేను పలు బాధలొందితి
మరి చేయునది లేక మార్గంబు దప్పితి
వలదు వలదీలోక వాంఛలన్నియు భ్రమర
శరణు శరణు నాదు శ్రమలన్ని బాపరా
పాపేచ్చలతో నేను పలు బాధలొందితి
మరి చేయునది లేక మార్గంబు దప్పితి
వలదు వలదీలోక వాంఛలన్నియు భ్రమర
శరణు శరణు నాదు శ్రమలన్ని బాపరా చరణం 2 :
శోధనలు నను చుట్ట ఆదరణ లేకయే
నాధ నీ భోదను కాదనుచు ద్రోసితి
కాదుగా నా ఎదను సిలువపై దీర్చితి
పాదములు పైబడితి భ్రాంతులను ద్రుంచరా
శోధనలు నను చుట్ట ఆదరణ లేకయే
నాధ నీ భోదను కాదనుచు ద్రోసితి
కాదుగా నా ఎదను సిలువపై దీర్చితి
పాదములు పైబడితి భ్రాంతులను ద్రుంచరా
చరణం 3 :
నీ ఆత్మ కాంతితో నన్ను వెలిగించరా
నీ వాక్య శక్తితో నన్ను ధృడపరచారా
నీ కృపతో ఇల నన్ను పిలచీ దీవింపరా
నిరతంబు నీ ప్రేమ నా యందు నిలుపరా
నీ ఆత్మ కాంతితో నన్ను వెలిగించరా
నీ వాక్య శక్తితో నన్ను ధృడపరచారా
నీ కృపతో ఇల నన్ను పిలచీ దీవింపరా
నిరతంబు నీ ప్రేమ నా యందు నిలుపరా
రచయిత ఎవరు,?తెలియ జేయ మనవి
ReplyDelete