Showing posts with label se. Show all posts
Showing posts with label se. Show all posts

Tuesday, 3 April 2018

శ్రీమంతుడా స్తోత్రార్హుడా - Srimanthuda stotrarhuda lyrics

శ్రీమంతుడా స్తోత్రార్హుడా 

పల్లవి :

శ్రీమంతుడా స్తోత్రార్హుడా

స్తుతులకు పాత్రుడా

నా దేవా నీకే స్తోత్రము

స్తోత్రము... స్తోత్రము...నీకే స్తోత్రము


చరణం 1  :

సన్నుతిoచుచు నేను పాడి
స్తుతి యాగములే చేసెదా 
హృదయపూర్వక ఆరాధన
చేసెదనయ్య నీ సన్నిధిలో
స్తోత్రము... స్తోత్రము...నీకే స్తోత్రము

చరణం 2  :


సమీపించక సాధ్యముకాని
తేజోమయుడవు నీవేగా
నిత్య మహిమలో నను చేర్చుటకు
నీ కృప నాపై చూపించినావు
స్తోత్రము... స్తోత్రము...నీకే స్తోత్రము

చరణం 3 :


అతిపరిశుద్ధుడా పరమతండ్రి
పరిశుద్ధాత్మ దైవమా 
నీదు ఆత్మతో అభిషేకించి
నీ సొత్తుగాను  చేసావు నన్ను
స్తోత్రము... స్తోత్రము...నీకే స్తోత్రము


Share:
Categories

Sunday, 25 March 2018

శ్రీ యేసురాజా నా జీవనాధ - Sri Yesu Raaja Naa Jeeva Naadha lyrics

శ్రీ యేసురాజా నా జీవనాధ  

పల్లవి :

శ్రీ యేసురాజా నా జీవనాధ
మా పాపముల కొరకు సిలువలో శ్రమనొంది 

జాలి లేని మా కొరకు యెలా ఈ త్యాగము

చరణం 1  :

ప్రేమ కరుణ  నీ దివ్యరూపం
శాంతి సహనం నీ సన్నిధానం
కలుషము బాపగా కలువరి సిలువలో
మరణమునొంది రక్షణనోసగి
నీ ప్రేమ మధురం ....మధురాతి మధురం 

చరణం 2  :

ఇలలో చెలరేగెను ఎన్నో పాపము
పాపానికి ఫలితము  ఈ ఘోర శాపం
మరణపు ముల్లును విరిచితివి
నిత్యజీవితము యిచ్చితివి
పరలోక భాగ్యం ...దయ చేసితివి 

Share:

Tuesday, 6 March 2018

శరణు శరణు దేవ - Sharanu sharanu Deva lyrics

శరణు శరణు దేవ  

పల్లవి :

శరణు శరణు దేవ శరణు ఓ  దేవా
శరణుజొచ్చితి రమ్ము కరుణతో బ్రోవ

చరణం 1  :

పాపేచ్చలతో నేను పలు బాధలొందితి
మరి చేయునది లేక మార్గంబు దప్పితి
వలదు వలదీలోక వాంఛలన్నియు భ్రమర
శరణు శరణు నాదు శ్రమలన్ని బాపరా 

చరణం 2  :

శోధనలు నను చుట్ట ఆదరణ లేకయే
నాధ నీ భోదను కాదనుచు ద్రోసితి 
కాదుగా నా ఎదను సిలువపై దీర్చితి
పాదములు పైబడితి భ్రాంతులను ద్రుంచరా 

చరణం 3  :

నీ ఆత్మ కాంతితో నన్ను వెలిగించరా
నీ వాక్య శక్తితో నన్ను ధృడపరచారా
నీ కృపతో ఇల నన్ను పిలచీ దీవింపరా
నిరతంబు నీ ప్రేమ నా యందు నిలుపరా 

Share:
Categories