నమ్మకమీయవ ప్రభూ
పల్లవి :
నమ్మకమీయవ ప్రభూ
స్థిర నమ్మకమీయవ
ప్రభూ
నీ అందు దినదినము
ఎదిగి
ఆవగింజంత
విశ్వాసం కొండంత పెరిగి
నీ పరలోక రాజ్యాన నిత్యజీవం పొందేందుకు
చరణం 1 :
అడుగుడి
ఇయ్యబడునన్నావు ... కనుకనే నిన్నడుగుచున్నాము
మా బ్రతుకు బాధలు
తొలగిమ్ము ... లేమి లేని సుఖ జీవం మాకిమ్ము
దిక్కులేని
దీనులo ... సుఖమెరుగని గానుగలం
నీ ఒడిలో సేదతీరు సుఖమున్నదిలే
అడుగుడి
ఇయ్యబడునన్నావు ... కనుకనే నిన్నడుగుచున్నాము
మా బ్రతుకు బాధలు
తొలగిమ్ము ... లేమి లేని సుఖ జీవం మాకిమ్ము
దిక్కులేని
దీనులo ... సుఖమెరుగని గానుగలం
నీ ఒడిలో సేదతీరు సుఖమున్నదిలే చరణం 2 :
వెదకుడి దొరకును
అన్నావు... కనుకనే నిను వేదకుచున్నాము
నీ దర్శనం మాకు
కలిగించు... మా బ్రతుకులో చీకటి తొలగించు
అడుగడుగున వేదనలు
.... అన్నిట్లో రోదనలు
నీ నామంలో
విశ్రాంతి ఉన్నదిలే
వెదకుడి దొరకును
అన్నావు... కనుకనే నిను వేదకుచున్నాము
నీ దర్శనం మాకు
కలిగించు... మా బ్రతుకులో చీకటి తొలగించు
అడుగడుగున వేదనలు
.... అన్నిట్లో రోదనలు
నీ నామంలో
విశ్రాంతి ఉన్నదిలే
చరణం 3 :
తట్టుడి
తీయబడునన్నావు... కనుకనే నిను తట్టుచున్నాము
నీ పరలోక రాజ్యపు
తలుపు తీయి... నువ్వు తోడుంటే మా బ్రతుకు హాయి
బాధలే బ్రతుకులు
... బ్రతుకులే గతుకులు
నీ వెలుగులో
నిత్యజీవము ఉన్నదిలే
తట్టుడి
తీయబడునన్నావు... కనుకనే నిను తట్టుచున్నాము
నీ పరలోక రాజ్యపు
తలుపు తీయి... నువ్వు తోడుంటే మా బ్రతుకు హాయి
బాధలే బ్రతుకులు
... బ్రతుకులే గతుకులు
నీ వెలుగులో
నిత్యజీవము ఉన్నదిలే
0 comments:
Post a Comment