వినవా మనవి యేసయ్యా
పల్లవి :
వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా...మలినము నాగతం పగిలెను జీవితం చేసుకో నీవశం వినవా ప్రభువా
చరణం 1 :
లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీదారి ఓడిపోతిని
విరిగిన మనసుతో నిన్ను చేరాను
విరిగిన మనసుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా.... నాతండ్రి నీవేనయ్యా
చరణం 2 :
ఆశయేది కనరాక బేలనైతినిబాధలింక పడలేక సోలిపోతినిఅలసిన కనులతో నిన్ను చూశాను చెదరిన కలలతో కృంగిపోయానునన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా.... నాదైవము నీవేనయ్యా
0 comments:
Post a Comment