అంకితం ప్రభూ నా జీవితం –
నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)
నీ సేవకై ఈ సమర్పణా – అంగీకరించుము నాదు
రక్షకా (2)
మోడుబారిన నా జీవితం – చిగురింపజేసావు
దేవా
నిష్ఫలమైన నా జీవితం – ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు (2)
అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||
కారు చీకటి కాఠిన్య కడలిలో – నీ
కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం – చిరుదివ్వెగా చేసావు
ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార ఛాయలను తొలగించుటకు (2)
అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||
0 comments:
Post a Comment