Monday, 25 May 2020

హీనమైన బ్రతుకు నాది - Heenamaina Brathuku Naadi Lyrics

హీనమైన బ్రతుకు నాది 

హీనమైన బ్రతుకు నాది ఘోర పాపిని (2)

దాపు జేరితిని శరణు కోరితిని

దిక్కు నీవే నాకు ఇలలో

లేరు ఎవ్వరు నాయను వారు     

||హీనమైన||

 

మనిషికి మమత ఉన్నందుకా గుండె కోత

మదిలో నిన్ను నింపుకున్నందుకా విధి రాత (2)

కరుణించి నన్ను కష్టాలు బాపు (2)

కరుణామయా క్రీస్తేసువా     

||హీనమైన||

 

తల్లి తండ్రి కన్న మిన్న నీ మధుర ప్రేమ

భార్య భర్తల కన్న మిన్న మారని నీ ప్రేమ (2)

పాపి కొరకు ప్రాణమర్పించిన (2)

త్యాగ శీలివి నీకే స్తోత్రము       

||హీనమైన||

 

నిన్న నేడు రేపు యేసు మారనే మారవు

లోకులంత మారిపోయిన స్థిరమైన వాడవు (2)

వెరువను జడియను (2)

నీ కంటి పాపను నను కాచే దైవమా        

||హీనమైన||



Share:

0 comments:

Post a Comment