Thursday, 4 June 2020

యేసయ్యా నా హృదయ స్పందన - Yesanna Naa Hrudaya Spandana


యేసయ్యా నా హృదయ స్పందన

యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా -2

విశ్వమంతా నీ నామము ఘణనీయము -2        

||యేసయ్యా||

నీవు కనిపించని రోజున

ఒక క్షణమొక యుగముగా మారెనే -2

నీవు నడిపించిన రోజున

యుగయుగాల తలపు మది నిండెనే -2

యుగయుగాల తలపు మది నిండెనే         

||యేసయ్యా||

నీవు మాట్లాడని రోజున

నా కనులకు నిద్దుర కరువాయెనే -2

నీవు పెదవిప్పిన రోజున

నీ సన్నిధి పచ్చిక బయలాయెనే -2

నీ సన్నిధి పచ్చిక బయలాయెనే         

||యేసయ్యా||

నీవు వరునిగా విచ్చేయి వేళ

నా తలపుల పంట పండునే -2

వధువునై నేను నిను చేరగా

యుగయుగాలు నన్నేలు కొందువనే -2

యుగయుగాలు నన్నేలు కొందువనే         

||యేసయ్యా||

Share:

0 comments:

Post a Comment