ఊపిరికే ఊపిరివై...
పాటల పల్లకివై నిలిచావు
కనురెప్ప పాటైన కను మూయలేదు ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితి లోను నను దాటిపోలేదు ప్రేమ ప్రేమ
పగలు రేయి పలకరిస్తుంది పరమును విడచి నను వరియించింది
కలవరిస్తుంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ
||కనురెప్ప||
1.
ప్రేమ చేతిలో నను చెక్కు కున్నది
ప్రేమ రూపులో నన్ను మార్చియున్నది
ప్రేమకు మించిన దైవము లేదని
ప్రేమను కలిగి జీవించమని
ఎదురు చూస్తుంది ప్రేమా
కలవరిస్తుంది
క్రీస్తు ప్రేమ
||కనురెప్ప||
2.
ప్రేమ లోగిలికి నన్ను పిలుచు చున్నది
ప్రేమ కౌగిలిలో బందించుచున్నది
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనె లేదని
కలవరిస్తుంది ప్రేమా
కలవరిస్తుంది
క్రీస్తు ప్రేమ
||కనురెప్ప||
రచన – గుంటూరు రాజా
0 comments:
Post a Comment