యేసుని సుచరితము
యేసుని సుచరిత మెంత పొనరినది యెవ్వరు విని యెద రీ జగతిన్
భాసుర నయ మను బంధము గలిగిన భక్తుల కిది సౌ భాగ్యముగా
||యేసు||
సిలువపై నిలచి చేటు వడుచు మరి చివరకు జనకుని చిత్తమునన్
చెలువగ మనవిని జేసెను నరులకు శిక్ష తొలఁగుటకు శ్రీకరుఁడౌ
||యేసు||
పాప రహిత య పార మహిమమున పాత్రమ మరి కుడి పార్శ్వ మునన్
పాపులవిషయము ప్రార్థన మొనర్చెడి భావము గల హిత భాస్కరుఁడౌ నా
||యేసు||
దుషులు ననుఁ గని దూషణ నుడువులు దగ్ధము లనక దూరిన నా
ఇష్టుఁడు వడసిన యిడుమలు దలఁచి యించుక పగ మది నెంచను నా
||యేసు||
Yesuni Sucharithamu lyrics
Andhra Kristhava Keerthanalu
0 comments:
Post a Comment